ఫోకస్

రాజకీయాలకు అతీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ పాలనాపరంగా ప్రభుత్వాల్లో తలెత్తే సంక్షోభాలను నివారించాలి. గవర్నర్ అంటే రాష్ట్రాలకు రాజ్యాంగ సంరక్షకుడు. కాని ఇటీవల కాలంలో గవర్నర్ పదవి దుర్వినియోగమవుతోంది. రాజ్‌భవన్‌లో ఉండే గవర్నర్ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నడుచుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు సంక్షోభంలో గవర్నర్ పాత్రను శంకించలేం. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని ఆశించిన శశికళకు కోర్టు శిక్షను ధ్రువీకరించింది. కోర్టు తీర్పు తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుందామనే తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితి ఉంది. కాని నిన్న మొన్నటివరకు శశికళకు మెజార్టీ ఉన్నా, గవర్నర్ పిలవక పోవడంపై అందరూ సామాన్య ప్రజలు అనుమానించారు. కాని రాజకీయ దూరదృష్టితో చూస్తే గవర్నర్ ఆలస్యం చేయడమే మేలైంది. కాని గవర్నర్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తి బలాబలాలపై అనుమానం ఉంటే అసెంబ్లీలోనే బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్న సమయంలో జగదాంబికాపాల్ అనే కాంగ్రెస్ నేత తనకే మెజార్టీ ఉందని చెప్పారు. ఆ సమయంలో సుప్రీం కోర్టు జోక్యంచేసుకుని ఉమ్మడి బలపరీక్షకు ఆదేశించింది. ఈ బలపరీక్షలో జగదాంబికాపాల్ ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అంతే. పన్నీర్ సెల్వం తనకే మెజార్టీ ఉందంటున్నారు. కొత్తగా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళినిస్వామి కూడా తనకే మెజార్టీ ఉందంటున్నారు. ఈ సమయంలో గవర్నర్ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలి. 1984లో రామ్‌లాల్ అనే ఏపి గవర్నర్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పదవీచ్యుతిడిని చేసి నాదెండ్ల భాస్కరరావుకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పాడు. అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఉద్యమం వచ్చింది. ఎన్టీఆర్ మళ్లీ తన బలాన్ని నిరూపించుకున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమకు కావాల్సిన వ్యక్తిని గవర్నర్ పదవిలో నియమిస్తున్నారు. ఈ గవర్నర్లు కూడా తమను నియమించిన నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తరహా పద్ధతులను గవర్నర్లు విడనాడాలి. గవర్నర్ పదవి కీలకమైంది. రాజ్యాంగబద్ధంగా, పక్షపాతరహితంగా నడుచుకోవాలి. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఒక గవర్నర్ అనుచితంగా ప్రవర్తించినందుకు కేంద్రం వేటువేసింది. రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదా అధికార పార్టీలో ముసలం పుట్టినప్పుడు లేదా ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకమవుతుంది. ఈ విషయమై సుప్రీం కోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చింది. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి నియమాకం విషయంలో అసెంబ్లీ లేదా లోక్‌సభలోనే బలపరీక్ష జరగాలి. అంతేకాని గవర్నర్ రాజ్‌భవన్‌లో తలలు లెక్కపెట్టడం, బలప్రదర్శనగా వచ్చిన ఎమ్మెల్యేలను లెక్కపెట్టి సంతృప్తి చెందడం సరైన విధానం కాదు.
- విశే్వశ్వరరెడ్డి
వైకాపా శాసనసభాపక్ష ఉపనేత

- విశే్వశ్వరరెడ్డి