ఫోకస్

గవర్నర్లది కీలక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కీలక బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. శాసనసభలో అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలన్న అంశంపై గవర్నర్ నిర్ణయమే కీలకమవుతుంది. బల నిరూపణకు ముందుకు వచ్చే శాసనసభా పక్ష నేత స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనే అంశాన్ని గవర్నర్ నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. మెజార్టీ ఉందని వచ్చిన శాసనసభ పక్ష నేతకు అవకాశం ఇచ్చినప్పటికీ భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని భావిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకునే అధికారం కూడా గవర్నర్ వ్యవస్థకు ఉంటుంది. గవర్నర్ సంతృప్తి చెందిన మీదటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారు. గవర్నర్ నిర్ణయం తీసుకునే క్రమంలో కొంత ఆలస్యం జరిగి ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పనిలేదు. పరిస్థితులననుసరించి వేచిచూసే ధోరణిని తప్పు పట్టాల్సింది కాదు. ఇదే సందర్భంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం రాజ్యాంగానికి లోబడే ఉంటుంది. దీన్ని సందేహించాల్సిన అవసరం లేదు. తాను ఎంపిక చేసే వ్యక్తి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని భావించినప్పుడు రాజ్యాంగ పరిధిలోనే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే గవర్నర్ పనితీరు అర్థమవుతుంది. కొద్ది రోజులుగా తమిళనాడు అసెంబ్లీలో నెలకొన్న ప్రతిష్టంభనపై తాత్కాలిక గవర్నర్ ఇదే విధానాన్ని అనుసరించారనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా, ఎఐఎడిఎంకె శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నిక తదితర పరిణామాలతో అసెంబ్లీలో చోటుచేసుకున్న సంక్షోభంలో గవర్నర్ రాజ్యాంగ పరిధిలో తన పరిమితులకు లోబడే వ్యవహరించారు. ఎఐఎడిఎంకె శాసనసభా పక్ష నేతపై అవినీతి కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికిముందు గవర్నర్ కూడా న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవడం గమనించాలి. తద్వారా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే మరో సంక్షోభం తలెత్తకుండా చూడగలిగారు. దీనివల్ల మంచే జరిగిందని భావించాలి. అయితే అన్ని నిర్ణయాలు రాజకీయ కోణంలో చూడాలనుకోవడం కూడా శాంతిభద్రతలపై ప్రభావం చూపుతుంది.
- కంభంపాటి హరిబాబు
ఎపి బిజెపి అధ్యక్షుడు

- కంభంపాటి హరిబాబు