ఫోకస్

కేంద్రానికి ఏజెంటు కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహారించాలే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారవద్దు. తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్‌గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్ రావు వెంటనే శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించకుండా, జాప్యం చేసేందుకు అందుబాటులో లేకుండా వెళ్ళారు. తద్వారా రాజ్యాంగ సంక్షోభానికి ‘తెర’ లేచింది. శశికళపై అక్రమాస్తుల కేసులు ఉన్నందుకే ప్రమాణ స్వీకారం చేయించలేదన్న వాదన ఉన్నది. అదే నిజమైతే శశికళను ప్రమాణ స్వీకారం చేయించలేమని, మరొకరిని లెజిస్లేచర్ పార్టీ నాయకుని (ముఖ్యమంత్రి)గా ఎన్నుకోవాలని రాజ్‌భవన్ నుంచి అధికారికంగా చెప్పి ఉంటే వివాదం సమిసిపోయేది. పైగా మెజారిటీ ఎమ్మెల్యేలు నేతగా ఎన్నుకున్న వ్యక్తిని వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ధర్మం. అక్రమార్జన కేసుల్లో శశికళను కోర్టు తప్పుపట్టినా, దోషిగా నిర్ధారించినా, నైతిక బాధ్యత వహించి పదవినుంచి తప్పుకునేవారు. ఒకవేళ తప్పుకోకపోయినా తొలగించేందుకు అవకాశం ఉండేది. కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించకపోవడమనేది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఈ విషయంలో తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ వంద శాతం తప్పు చేశారు. శశికళను ప్రమాణ స్వీకారం చేయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు కాగా, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ కోర్టు ఆ వ్యాజ్యాన్ని విచారణకు చేపట్టకుండా తోసిపుచ్చింది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని ప్రజలు భావిస్తున్నారు. లోగడ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి గవర్నర్లు తొత్తులుగా ఉన్నారని, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని బిజెపి అగ్ర నాయకులంతా విమర్శించారు. ఇప్పుడు చేస్తున్నదేమిటో ఆ పార్టీ అగ్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ విషయానికి వస్తే ఆయన్ను కించపరచాలన్న భావన ఎవరికీ లేదు. కానీ గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి భజన చేయడం భావ్యం కాదు. నాడు తివారీ రాసలీలలు చేసినా, నేడు రాజ్‌భవన్ రాజకీయ లీలలకు వేదికగా మారినా వ్యతిరేకిస్తాం. ప్రతి ఒక్కరూ ఖండించాలి. రాజ్యాంగబద్ధంగా వ్యవహారించాల్సిన గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లు కావద్దని వినతి.
- పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపి,
టి.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

- పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపి,