ఫోకస్

మీన మేషాలు లెక్కిస్తే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ వ్యక్తులున్నా గవర్నర్లు తమ విచక్షణాధికారాలను కోల్పోరాదు. కేవలం కీలుబొమ్మలా ఉంటే ప్రయోజనం ఏముంటుంది? ప్రజాస్వామ్యానికే అది మచ్చలా కన్పిస్తుంది. గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులనుబట్టి ఎప్పటికప్పుడు రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం కేంద్రం పెట్టిన భిక్ష అనే పద్ధతిలో ఉండరాదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు అదే పంథాలో నడుస్తున్నారు. స్వంత నిర్ణయాలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తే ఎవరికైనా గవర్నర్ వైఖరి నవ్వు కలిగించక మానదు. ప్రస్తుతం తమిళనాడులో అదే పరిస్థితి నెలకొంది. అక్కడ పక్షం రోజులుగా గవర్నర్ పాలనగానీ, ముఖ్యమంత్రి పాలనగానీ లేనిపరిస్థితి. అలాంటి పరిస్థితిలో గవర్నర్ మీనమేషాలు లెక్కిస్తే ఎలా? ప్రజలు ఆగ్రహం చెందితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? గవర్నర్లు పారదర్శకంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా పనిచేసినపుడు ఆ పదవికి వనె్న తీసుకురాగలరు. గవర్నర్లు రాజ్యాంగానికి లోబడి ఏదేని నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ హర్షిస్తారు. రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జాప్యం చేస్తే అక్కడ గవర్నర్ ఉండి ప్రయోజనం ఏముంది? ఏ నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ చేష్టలుడిగి చూస్తుంటే ప్రజలకు గవర్నర్ తీరుపై ఆగ్రహం కలుగదా?
తెలంగాణలో తీరు భిన్నం. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీలు మారడానికి కారణం ఏదేని కావచ్చు. అలాంటపుడు గవర్నర్ తన పాత్రను పోషించకపోతే ఎలా? గవర్నర్ తన అధికారాలను ఉపయోగించడంలో తాత్సారం చేస్తున్నారు. కేంద్రానికి లోబడి ఏజెంట్ మాదిరిగా పనిచేస్తే ప్రయోజనం ఏముంటుంది? గవర్నర్లు స్వతాహాగా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉండాలి. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సరైన చర్యలు చేపట్టాలి. ఏ రాష్ట్రంలో చూసినా గవర్నర్లు కేవలం కీలుబొమ్మలా ఉంటున్నారనే విమర్శలు ఉంటున్నాయి. అలాంటి ముద్ర చెరిగిపోవాలంటే గవర్నర్లు పారదర్శకంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కేంద్రంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. అలాంటపుడే గవర్నర్ల వ్యవస్థకు గౌరవం కలుగుతుంది. లేనిచో గవర్నర్ల వ్యవస్థ ఉన్నా ప్రేక్షకపాత్ర తరహాలో ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- బొత్స సత్యనారాయణ
ఏపి రాష్ట్ర వైకాపా నేత

- బొత్స సత్యనారాయణ