ఫోకస్

దేశ భద్రత కాంగ్రెస్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ భద్రత కాంగ్రెస్‌తోనే సాధ్యం. బిజెపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మతఛాందసవాదులు రెచ్చిపోతుంటారు. లోగడకూడా వాజ్‌పేయ ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంటుపై ముష్కరుల దాడి జరిగింది. దేశ అంతర్గత భద్రత గురించి బిజెపి అగ్ర నాయకులు చాలా పెద్ద మాటలు చెబుతుంటారు. ఆచరణకు వచ్చేసరికి మాత్రం చేతులు పైకి ఎత్తేస్తారు. ఇప్పుడు పఠాన్‌కోట్‌లో జరుగుతున్న దురదృష్టకరమైన సంఘటనలతో యావత్ దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దేశంలో టెర్రరిజాన్ని రూపుమాపడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విఫలమవుతోంది. టెర్రరిస్టులు పట్టణాలను టార్గెట్ చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో అలజడులు, హింసాత్మక ఘటనలు జరగలేదు. ఎక్కడైనా ఒకటి, రెండు చిన్న ఘటనలు చోటుచేసుకున్నా, అటువంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని మతాలను సమానంగా ఆదరించింది.
ఇప్పుడు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకునే సమయం కాదు. దేశానికి ఎటువంటి ముప్పు ముంచుకొచ్చినా రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఎదుర్కొవాలి. అందుకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ చేయి-చేయి కలిపి దేశాన్ని రక్షించుకోవాలి. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, దీనిని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టి సహకారం తీసుకోవాలి. ప్రపంచ దేశాల సహాయ, సహకారాలు తీసుకోవాలి. భద్రతకు ముప్పు వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఈ విషయంలో మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అన్ని మతాలు, అన్ని కులాలు, కలిసి ఉండేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్రం తమను చిన్నచూపు చూస్తున్నదన్న భావన మైనారిటీవర్గాల్లో రానీయకూడదు. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రిస్టియన్లు ఇలా ఏ మతమైనా, ఏ కులమైనా కేంద్రం భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి. అప్పుడే అలజడులకు ఆస్కారం ఉండదు.

- గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి, ఎపి కాంగ్రెస్ కమిటీ