ఫోకస్

చర్చల భగ్నానికే దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్ పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి హేయమైనదని, ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని, అదే సమయంలో పాకిస్తాన్‌తో శాంతి చర్చలకు విఘాతం కలగకుండా భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చర్చలనుంచి వైదొలిగితే, భారత్, పాకిస్తాన్ భవిష్యత్తుని ఇక ఉగ్రవాద బృందాలు నిర్ణయించడం మొదలుపెడతాయి. చర్చలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దాడి చేశారు. మన ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న లాహోర్‌లో పర్యటించారు. అంతకుముందు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ అంతర్జాతీయ సదస్సులో కొంతసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. మన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నవాజ్ షరీఫ్ ఢిల్లీకి వచ్చారు. శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమైతే, తమ మనుగడకు, ఉనికికి భంగం వాటిల్లుతుందనే భయంతో ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌పై దాడి చేశారు. ఆగ్రహాన్ని, విద్వేషాలను అశాంతిని ప్రేరేపించడానికి ఉగ్రవాదం ప్రయత్నిస్తుంటుంది. పటిష్ట భద్రత, చర్చలు, శాశ్వత పరిష్కారంతోనే మనం సమాధానం చెప్పాలి. మనుగడకోసం పాకిస్తాన్‌కు, అభివృద్ధి, ఆర్థిక అద్భుతాలకోసం భారత్‌కు శాంతి కావాలి. ఉగ్రవాదుల దాడుల విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించాలి. యుద్ధోన్మాద భాషను అదే పనిగా ఉపయోగిస్తూ రెచ్చగొట్టడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. సహనం బలవంతుల లక్షణం. దక్షిణాసియాలో శాంతి వికసించాలంటే రెండు దేశాల మధ్య చర్చలు అవసరం. ఇరు దేశాల మధ్య సామరస్యత కుదిరితే ఉనికి ఉండదనే భయం ఉగ్రవాదులకు పట్టుకుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయనే సంకేతాలు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్ధలు ఈ తరహా దాడులకు తెగబడుతుంటాయి. వీటిని తిప్పిగొడుతూనే చర్చలకు ఇరు దేశాలు సిద్ధమైతే బాగుంటుంది.

- డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్‌సత్తా వ్యవస్థాపకుడు