ఫోకస్

..నివృత్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాంగాల పట్ల సామాన్య జనానికి వున్న గందరగోళాన్ని నివృత్తి చేయాల్సి వుంది. మన ఆంధ్రదేశంలో 4 రకాల పంచాంగాలు బజారులో లభ్యమవుతున్నాయి. ఒకటి- ఆనాడు సూర్య సిద్ధాంతంలో చెప్పిన నేటి కాలానుగుణంగా మార్చకుండా చేస్తున్న గణిత సంబంధాన్ని పూర్వ పద్ధతి పంచాంగం అంటారు. ఇది శ్రీశైలంవారి ద్వారా విడుదల అవుతోంది. రెండోది- భారత ప్రభుత్వం కేలండర్ రీఫార్మ్ కమిటీలో చెప్పిన అంశాలతో కూడుకున్న పంచాంగం- చైత్ర పక్ష (చిత్తా నక్షత్రం ధృవంగా తీసుకుని) పంచాంగం అంటారు. ఈ పంచాంగం భారత ప్రభుత్వంచే కోల్‌కత్తా నుంచి 14 భాషలలో విడుదలవుతోంది. దీనినే ఎన్‌సి లహరి పంచాంగం అని కూడా అంటారు. మూడోది- మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ గారి పంచాంగం. ఈ పంచాంగం వరాహమిహురుల వారి గణిత ఆధారంగా ఎప్పటికపుడు దృక్సాలతను చేసుకుని చేయుచున్న పంచాంగం దీనిని దృక్ పంచాంగం లేక ఛాయార్క-కరణార్క గణితాధారంగా చేయుచున్న పంచాంగం అంటారు. ఈ మూడు పద్ధతులవారు.. పూర్వ పద్ధతి అయినా, తప్పయినా, ఒప్పయినా రవ్యాది గ్రహాలు అన్ని గణితాలలోనూ వారు తీసుకున్న పంథాలో చేస్తున్నారు. కానీ వీరి అందరికంటే భిన్నమైనది టిటిడి పంచాంగం. వీరి పంచాంగంలో రవి చంద్రుల గణితాలను అనగా.. తిధి, కరణం, తిథిద్వారా ఏర్పడు సర్వ పండుగల అవసరాన్ని కాలాదులను శ్రీశైలం వారి పూర్వ పద్ధతిలోనూ, కుజాది గ్రహాల గణితాలను ఎన్‌సి లహరి భారత ప్రభుత్వం పద్ధతిలోనూ గణితం చేస్తుంటారు. ఈ గందరగోళ పరిస్థితే శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది విషయంలో తేటతెల్లమవుతోంది. ఇటువంటి పరిస్థితులలో ధర్మశాస్త్రంలో చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే సూర్యోదయానికి ముందూ, వెనుక ఆనాటి తిథికి సూర్యుని స్పర్శ వున్నచో ఆ తిథినే పరిగణనలోకి తీసుకుని పండుగ, పర్వదినాలు నిర్ణయించడం మంచిది.

- మధుర పాలశంకరశర్మ జ్యోతిష్య విజ్ఞాన కేంద్రం, రాజమహేంద్రవరం.