ఫోకస్

ప్రత్యక్ష ప్రమాణాలే అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూ ర్వపద్ధతి పంచాంగాలలో మకర సంక్రాంతిని ఉత్తరాయణ ప్రారంభంగా గుర్తిస్తున్నారు. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధమని పాండిత్యంతో సంబంధం లేని సామన్య జనులకు కూడా అర్థవుతుంది. సూర్యుని నుండి చంద్రుడి మాట 180 డిగ్రీల దూరం నడిచే స్థితికి పౌర్ణమి పూర్తి అవుతుంది. ఆకాశంలో ఈ 180 డిగ్రీలు యంత్రాలతో పరిశీలిస్తే స్పష్టంగానే తెలుస్తుంది. సూర్యసిద్ధాంతంలో ఒక వచనముంది. సూర్యసిద్ధాంతం, చంద్రగ్రహణాధికారం 16వ శ్లోకంలో స్పటత ధ్యవసానేతు మధ్యగ్రహణమాది శేత్ పూర్ణిమ తిథి గ్రహణ మధ్యభాగం ఉండాలి అనేది పై వచనం అర్థం. ఈ వచనం లేకపోయిన, సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయమిది. ప్రత్యక్షంగా భూమి నీడ చంద్రుడిపై పడే సమయంలో సరైన మధ్యకాలానికి సూర్యునికి చంద్రునికి 180 డిగ్రీలు ఉంటుంది అనేది అతి సామన్య విషయం. దీనినిబట్టి ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపించే గ్రహణం తిథి నిర్ణయంలో ప్రత్యక్ష ప్రమాదం అవుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం ఉంది. దాని మధ్యకాలం రాత్రి 11.49 నిమిషాలు. ఈ రోజున దృక్ గణిత రీత్యా పూర్ణిమ యొక్క అంత్యభాగం రాత్రి 11.41 నిమిషాలు. పూర్వపద్ధతి పంచాంగంలో పేర్కొన్న పూర్ణిమ అంత్యభాగం 10.46 నిమిషాలు, గ్రహణ మధ్య భాగమైన 11.49 నిమిషాలకు మధ్యలో ఒక గంట మూడు నిమిషాల భేదం ఉంది. దృగ్గణిత పంచాంగంలో ఆ తేడా కేవలం 8 నిమిషాలే. ప్రత్యక్ష ప్రమాణానికి దగ్గరగా ఉందని భావించడం జరుగుతుంది. జ్యోతిష ప్రపంచంలో వరహమిహిరుడు ఒక మైలు రాయి. ఆయన బృహత్ సంహితలో 24వ శ్లోకంలో రాహుకాలాధ్యాయంలో గ్రహణ దర్శన ఫలం చెప్పాడు. గ్రహణం చెప్పబడిన సమయానికి ముందుగానే పట్టినట్లైతే గర్భస్రావాలు, ఆయుధ భయాలు, గ్రహణం చెప్పిన టైముకంటే తరువాత కూడా గ్రహణం కొనసాగితే పుష్పములు, ఫలములు నశిస్తాయి, సస్యాలు నశిస్తాయి, భయం కలుగుతుందని ఆ శ్లోకం అర్థం. చెప్పబడిన సమయం కంటే ముందు వెనుకలైతే పూర్వ శాస్తమ్రులను అనుసరించి ఫలితం 25వ శ్లోకంలో చెప్పబడింది. కాని స్పష్టంగా గణితం తెలిసిన వ్యక్తి లెక్కిస్తే ఎప్పటికీ కాలము ముందు వెనుకలు కాదు అని చెప్పారు. దీనినిబట్టి గ్రహణం ప్రత్యక్ష ప్రమాణమని దృక్‌తుల్యమని లెక్కించేవారు సరిగా లెక్కిస్తే ఆకాశంలో స్పష్టంగానే కనిపిస్తుందని వరాహమిహిరుని భావన తెలుపుతోంది. ఈ దృష్టకోణంలో ఆలోచన చేసినపుడు మరికొన్ని అంశాలు కూడా ప్రత్యక్ష ప్రమాణాలకు తోడైనవి స్వీకరిస్తే దృగ్గణిత ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదా: మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలంగా పూర్వపద్ధతి పంచాంగాల్లో చూపిస్తూ ఉంటారు. కాని డిసెంబర్ 22న జరుగుతున్న సాయన మకర సంక్రాంతి ఉత్తరాయణాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఆకాశంలో అందరూ దానిని గమనించవచ్చు.
సాయన మకర సంక్రాంతి అసలైన సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలమని అంటాం. నిరయన మకర సంక్రాంతి మేక మెడకు వేలాడే స్తనముల వలే నిష్ప్రయోజనమైనది. ఆయనాంశ సంస్కృతుడైన సూర్యుడు ఆకాశంలో సంచరిస్తున్నాడు. రాశి సంక్రాంతి ముఖ్యం కానిది, స్నాన, దాన, జప, శ్రాద్ధ, వ్రత హోమాదుల పుణ్యం చల సంక్రాంతిలోనే అక్షయమైన ఫలితాన్నిస్తుంది. పగలు రాత్రి మొదలైన వాటి ప్రమాణాలు రాశి సంక్రాంతి వల్ల మారవు. సాయన సంక్రాంతి వల్లనే మారుతాయి. అదే పుణ్యప్రధానమైనది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నా రుతువుల క్రమంకూడా సాయన రాశి ప్రవేశాలను బట్టి ఆకాశంలో జరుగుతుంది గుర్తించినా నిరయన మకర సంక్రాంతి కంటే ఉత్తరాయణ మకర సంక్రాంతికి మూలమైన సాయన మకర ప్రవేశమే ఎక్కువ పుణ్యకాలమని తెలుస్తోంది. కాని పూర్వపద్ధతి పంచాంగంలో నిరయన మకర సంక్రాంతినే ఉత్తరాయణ పుణ్యకాలంగా చూపిస్తున్న కారణంగా సామాన్య ప్రజల్లో డిసెంబర్ 21 ఉత్తరాయణ పుణ్య కాలం అనే విషయం తెలియక స్నానదాన జపాదికంవల్ల పొందదగిన సత్ఫలితాలను పొందలేకపోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సమ్మతం, బహు పండిత సమ్మతము ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రమాణాలు కలిగిన దృగ్గణిత పద్ధతిని అనుసరించి ఉగాదిని మార్చి 28నే జరుపుకోవడం పుణ్యప్రదము. బాణవృద్ధి రసక్షయ: మొదలైన వచనాలను ఉదహరిస్తూ ఇది ఇంతకంటే పెరగకూడదు, ఇంతకంటే తగ్గకూడదు అనే నియమాలను ఏర్పరచడం కంటే తిథి ఎంత వస్తుందో ఆ లెక్కను యథాతథంగా స్వీకరించడమే శాస్త్రానుసారం అవుతుందని విజ్ఞులు గుర్తించుకోవాలి

- ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం జ్యోతిష వాస్తు శాఖ డీన్, తెలుగు విశ్వవిద్యాలయం