ఫోకస్

హిందువులంటే పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు రాష్ట్రాల్లో ఆలయాల పట్ల పాలకులు శ్రద్ధ చూపుతారని భావిస్తే, మార్పు ఏమీ లేదు. కంటితుడుపు ఓదార్పు చర్యలే తప్ప హిందూ మతంకోసం చేస్తున్నదేమీ లేదు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల వంటిని నిర్వహించడం మినహా హిందూ మతంపై జరుగుతున్న దాడిని, మత మార్పిడుల కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునే చర్యలేమీ లేవు. ఒక ముఖ్యమంత్రి మేరిమాత చర్చిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఉభయ రాష్ట్రాల్లో వేల ఆలయాలు ఆలనా పాలనా లేక మూతపడ్డాయి. శిధిలావస్థకు చేరుకున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో ఆలయాల ద్వారా ఆదాయం ఏటా మూడువేల కోట్ల రూపాయలు. ఆలయాల నిధులను హిందూ మత ప్రచారానికి ఉపయోగించాలి. ఆలయాలు కేంద్రంగా ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణ జరగాలి. హరిజన, గిరిజనవాడల్లో వారు కోరుకున్న దేవుని ఆలయాలను ఆలయాల నుంచి వచ్చే ఆదాయంతో నిర్మించాలి. వారినే అర్చకులుగా నియమించాలి. ఏ వర్గాలు మత మార్పిడులకు గురవుతున్నాయో గమనించి, అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంచాలి. దేవాదాయ శాఖలో సంస్కరణ కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రయత్నిస్తే, కొన్ని ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఒక ముఠాగా ఏర్పడి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సంస్కరణ అమలును అడ్డుకున్నారు, ఇది బాధాకరం. ఆలయాలకు ముఖ్యమంత్రి, గవర్నర్ వెళ్లడం ద్వారా హిందూమతాన్ని పట్టించుకుంటున్నట్టు ప్రచారం లభించవచ్చు కానీ చేయాల్సింది అది కాదు. హిందూ మతంకోసం పటిష్టమైన కార్యాచరణ ఉండాలి. అనేక రూపాల్లో హిందూమతంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొనే చర్యలు కావాలి. టిటిడివారి శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ద్వారా హిందూ మతంపై ప్రచారం చేయవచ్చు కానీ అక్కడి సిబ్బంది మాత్రం మేం ప్రభుత్వ ఉద్యోగులం అలా చేయకూడదని అంటున్నారు. వారు టిటిడి ఆలయ ఉద్యోగులు అవుతారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కారు. హిందువుల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి