ఫోకస్

అహంకారాన్ని తొలగించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ బుగ్గకారు తొలగించడం అనేది రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యానికి రావడానికి ఒక సంకేతం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ సమాన హోదా కలిగి ఉండటం అనే దానికి ఇదో ఒక ఉదాహరణ. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా, ఇంకా పాతకాలపు రాజరిక వ్యవస్థను సూచించే బుగ్గకారు విధానాన్ని రద్దు చేయడం అందరూ హర్షించదగింది. అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో బుగ్గ కారుతో వచ్చిన అహంకారాన్ని ఒక్కసారిగా తొలగించారు. ప్రజలకు అధికారులు, నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, వివిధ హోదాల్లో ఉన్నవారు కావచ్చు, వారంతా ప్రజలకు మరింత సన్నిహితం అయ్యేందుకు ఇది దోహదపడుతుంది. వీరంతా ప్రజలతో సమానంగా ప్రయాణం చేయాలన్నది ప్రధాని నరేంద్రమోదీ భావన. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో ప్రజాసేవకులు ప్రయాణించాలని, కేవలం తమ హోదాను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజలకు నిత్యం వారి వ్యవహారాలకు భంగం కలిగిస్తూ ప్రయాణించే విధానానికి తిలోదకాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన నడవడానికి ఈ బుగ్గకారు ఆటంకంగా ఉండటం వల్లనే కేంద్రం అత్యున్నత స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. నేతల్లో లోలోపల ఉండే అహంకారాన్ని ఒక్కసారిగా సమూలంగా పరిహరించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాల్లో భాగం ఇది. ప్రజలకు, నాయకులకు మధ్య అంతరం చేయకుండా ఉండటానికి బుగ్గకారు తొలగించాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయం. విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ప్రజలకు సన్నిహితంగా ఉండటానికి చేసే ప్రయత్నానికి ఇది శ్రీకారం వంటిది. అందుకే దేశ ప్రజలు అంతా ప్రధానమంత్రి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

- ప్రొఫెసర్ కె యాదగిరి తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్