ఫోకస్

రాజకీయాల్లో సాంస్కృతిక మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, భారతదేశంలో కనిపించేంత ప్రోటోకాల్ ఎక్కడా కనిపించదు, మరీ ముఖ్యంగా ఎర్రలైటు వేసుకునో, పచ్చలైటు వేసుకునో ప్రజా ప్రతినిధులో, అధికారులో హడావుడి చేయడం మనదేశంలోనే ఎక్కువ. అత్యంత ప్రముఖుల వినియోగానికే పరిమితం కావల్సిన ఎర్రబుగ్గలు మోటారు వాహన చట్టం-1988లోని 108వ నిబంధన దుర్వినియోగం కారణంగా వందలాది ‘పెద్దల’ దర్పాన్ని ప్రదర్శించేవిగా భ్రష్టుపట్టాయి. విఐపి సంస్కృతి వికృతత్వం, ఎక్కడికక్కడ జోరెత్తుతున్న బుగ్గకార్ల సంఖ్య చూస్తే అర్థమవుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు నేను పర్యటించాను. కనీసం 15 దేశాల్లో ప్రోటోకాల్ గమనించాను. మన పక్కన ఉన్నది ఎవరో అత్యున్నత వ్యక్తి అన్నది మనం పరిచయం చేసుకునేంత వరకూ మనకు తెలీదు. అంతగా వారు సామాన్యంగా వ్యవహరిస్తారు. ఇజ్రాయిల్ వంటి అత్యంత భద్రతా ముప్పు ఉన్న దేశంలో సైతం ప్రధాని ట్రాఫిక్ నిలిపివేత అనేది లేకుండానే ప్రయాణిస్తుంటారు. కాని మన దేశంలో ఇది కొంచెం ఎక్కువే అని చెప్పాలి. లండన్‌లో హైకోర్టు న్యాయమూర్తులు సైతం మెట్రోల్లో ప్రయాణిస్తారు. అదే మన దేశంలో జిల్లా స్థాయి నేతలు సైతం ఎర్రబుగ్గ లేదా నీలం బల్బు వాడుతుంటారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు. కొంతమంది అక్రమాలకు పాల్పడి ఈ ఎర్రబుగ్గను దుర్వినియోగం చేస్తుంటారు. పెద్ద పెద్ద నాయకుల దగ్గరకు వచ్చినపుడు తమకు ఏ నామినేటెడ్ పోస్టు కావాలో చెప్పకుండా, ఎర్రబుగ్గ ఉండే పోస్టు ఇవ్వండి అంటూ అడుగుతుంటారు. ఇదో విష సంస్కృతిలా మారింది. దీంతో ఈ అవినీతి అక్రమాలను, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకట్టవేసేందుకు ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి దేశం అంతా హర్షిస్తున్నారు. ఎర్రబుగ్గ కోల్పోయిన వారికి సహజమైన బాధ ఉంటే ఉండొచ్చు గాక, వారు తప్ప మిగిలిన వారంతా సంతోషిస్తున్నారు. ఇది రాజకీయాల్లో సాంస్కృతిక మార్పుగా చెప్పవచ్చు. ఇది స్వాగతించదగిందే. విఐపిలు సైతం సామాన్యులే. సామాన్యులతో వ్యవహరించాల్సిందే అని ప్రధాని తీసుకున్న నిర్ణయంద్వారా అందరికీ గుర్తుచేసినట్టవుతుంది. కార్లపై ఎర్రలైటు పెట్టుకుని తిరగడంవల్ల పనిసామర్ధ్యం ఎలా పెరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం 2013 ఆగస్టులో ప్రశ్నించింది. అధికార ఢాంబిక ప్రదర్శనగా ఉన్న ఈ ఎర్రలైట్లకు ప్రధాని నిష్కర్షగా చరమాంకం పలికారు. దీంతో పదవీపటోటోపానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. సాధారణ ప్రజల్ని రెండోతరగతి పౌరులుగా స్థిరీకరిస్తున్న విఐపి వికృత సంస్కృతికి ప్రధాని సరైన రీతిన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎర్రలైటు వినియోగించడంలో ఎప్పుడూ సాటి పౌరులు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించరాదు. లేదా తక్కిన వారి కంటే తాము అధికులమని భావించరాదు. అధికారంలో ఉన్నంతకాలం , అదీ విధుల్లో ఉన్నపుడు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అంటే దాని అర్థం చట్టం ముందు అందరూ సమానమే అన్న స్ఫూర్తిని కలిగించింది.

- ఎన్ రామచంద్రరావు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు