ఫోకస్

నేతలు మాటలు... నీటి మీది రాతలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటి రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మీది రాతల్లా మారాయి. రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు చాలా హడావుడి చేస్తున్నారు. చీటికి-మాటికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అక్కడినుంచి హైదరాబాద్ చేరుకోగానే ఫలానా కంపెనీలతో మాట్లాడాం, ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు, ఐటి కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారు. అలా చెబుతున్న కంపెనీల్లో 10 శాతం కూడా వచ్చినట్లు కనిపించడం లేదు. వచ్చేనెల 2వ తేదీకి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తి చేసుకోబోతున్నది. ఈ మూడేళ్ళలో ఏ మేరకు కొత్తగా కంపెనీలు వచ్చాయో, ఎన్ని వందల, వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలిగారో ప్రభుత్వం శే్వతపత్రం ఇవ్వాలి. ఇకపోతే ఐటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగించడం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని అనేక ఐటి కంపెనీలు దివాళా తీసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పంపించేస్తున్నాయి. వారు రోడ్లపైకి వచ్చి కొత్తగా ఉద్యోగాలకోసం వేట మొదలు పెడుతున్నారు. మిగతా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నా, తక్కువ మొత్తంలో జీతాలు చెల్లిస్తామంటున్నాయి. ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి తక్కువ జీతాలకు ఉద్యోగంలో చేరాల్సిన దుస్థితి కొందరిదైతే, మరికొందరికి ఉద్యోగాలే లభించడం లేదు. అసలే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులు అలమటిస్తుంటే, ఐటి కంపెనీల్లో ఉన్న ఉద్యోగాలు ఊడుతుండడంతో, నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతున్నది. ఈ పరిస్థితుల నుంచి నిరుద్యోగులను ఎలా గట్టెక్కిస్తారో రాష్ట్ర ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక లేదు. విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, వాటికి భూమి, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు కల్పిస్తూ, ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అటువంటప్పుడు నిరుద్యోగ సమస్యను ఏ మేరకు తీర్చగలిగారో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని ఐటి, ఇతరత్రా పరిశ్రమలు కొత్తగా వచ్చాయో, వాటిల్లో ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయో తెలియజేస్తూ శే్వతపత్రం విడుదల చేయాలి.

- ఎం. అనిల్ కుమార్ యాదవ్, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్