ఫోకస్

ప్రాంతీయతత్వం ఉద్యోగుల పాలిట శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు ఐటి ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అయితే స్కిల్ డెవప్డ్ ఉద్యోగులకు అమెరికాలో ఎప్పుడూ అవకాశం ఉంటుంది. భారత్, ఇతరత్రా దేశాలకు చెందిన విద్యార్థులు బి.టెక్, ఇంజనీర్ చదివి అమెరికా వెళ్తున్నారు. అక్కడ తక్కువ జీతభత్యాలతో పనిచేయడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభించడం లేదు. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు హామీపై ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. కాబట్టి అక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి అమెరికాలో పనిచేస్తున్న భారత్‌తోపాటు మరికొన్ని దేశాల ఉద్యోగులను తొలగించడం సమంజసమే. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం ఆయా దేశాల విధి. తమ ప్రాంతాల అభివృద్ధికి ఆయా దేశాలు ప్రాంతీయతత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అనే అంశంతోనే విడిపోయింది. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు అమెరికాలో ప్రాంతీయతత్వం ప్రదర్శించడం పెద్ద సమస్య కాదు. ప్రాంతీయతత్వాన్ని మనమే పెంచిపోషిస్తున్నాం. ప్రస్తుతం అమెరికా స్వార్థంకోసం రెచ్చిపోతోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ట్రంప్ అమెరికాలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే ప్రతిభగల విద్యార్థులు, నిష్ణాతులైన ఇంజనీర్లు, వివిధ రంగాల్లో ఉన్నత చదువులకోసం అమెరికా వ్యతిరేకించడం లేదు. ప్రాంతీయతత్వం పోవాలి, సమానత్వం రావాలి. అందుకు మేథోశక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం. ఐటి రంగంలో భారతీయులే అధికంగా ఉన్నారు. వీరిని తొలగిస్తుంటే జాతి వివక్ష అంటున్నారు. అమెరికాలో జాతి వివక్షకు నిరుద్యోగ సమస్య ఒక కారణం. నిరుద్యోగ సమస్య ఎక్కువైనందుకు అమెరికాలో స్థానికేతరులను తొలగించడం వారి ఇష్టం. అయితే అమెరికాలో ఐటి ఉద్యోగులను తొలగించడం భారత్‌కు ఒక మంచి అవకాశం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఉద్యోగులు భారత్‌లో పనిచేస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఐటి రంగంలో పనిచేసే ఉద్యోగులు తమ స్కిల్స్‌ను ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థి దశనుంచే ఉన్నత ప్రమాణాలు గల విద్యనభ్యసించేందుకు వీలుంటుంది. మెరిట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే అవకాశం లేకపోలేదు.

- రాజారెడ్డి లోక్‌సత్తా, జాతీయ ఫైనాన్స్ కమిటీ చైర్మన్