ఫోకస్

శాస్ర్తియ విధానం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వమైనా, ప్రైవేట్ రంగమైనా తమ కార్యక్రమాలను సజావుగా కొనసాగించేందుకు, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు శాస్ర్తియ విధానం అవలంభించడం అవసరం. ఉద్యోగుల నియామకం, తొలగింపు విషయంలో కూడా శాస్ర్తియ విధానాన్ని అవలంభించాలి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులకు భద్రత ఉంది. ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి భద్రతా లేదు. ప్రైవేట్ రంగంలో నైపుణ్యానికి ప్రాధాన్యత ఉంది. ఐటి, ఐసిటి రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. దేశంలో బెంగుళూరు, చెన్నై తదితర నాలుగైదు నగరాలతో పోలిస్తే ఐటి, ఐసిటి రంగంలో హైదరాబాద్ వేగంగా దూసుకుపోతోంది. గత ఏడాది తెలంగాణ నుండి 75 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ కంపెనీ అయినా, సంస్థ అయినా తమ ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగుల నియామకం విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరం ఏర్పాటైన, ఏర్పాటవుతున్న ఐటి, ఐసిటి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుండటంతో దేశ, విదేశాలకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీలు తమ కార్యక్రమాల కోసం ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే మూడు లక్షల మందికిపైగా ఉద్యోగులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులే ఎక్కువగా పనిచేస్తున్నారు. వీరిపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఐటి, ఐసిటి సంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభించే సమయంలోనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేతనం లభించేచోటే పనిచేసేందుకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు, ఆ తర్వాత వీరికి చెల్లించాల్సిన వేతనాలు, ఇతర అలవెన్స్‌లు ఆటోమెటిక్‌గా పెరుగుతాయి. అందువల్లనే సదరు కంపెనీ ఆదాయ, వ్యయాలను, వారి ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల నియామకాలు చేపట్టడం, వారికి వేతనాలు, అలవెన్స్‌లు నిర్ణయించడం వల్ల ఎంప్లాయర్‌కు కానీ ఎంప్లాయికి కాని సమస్య ఏర్పడదు. దూరదృష్టి, శాస్ర్తియ విధానాలు లోపిస్తేనే సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

భద్రంరాజు సందీప్ టీం మేనేజర్, పిఆర్‌ఎ ఇంటర్‌నేషనల్