ఫోకస్

ఐటి కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ఐటి కంపెనీల్లో రానున్న మూడేళ్లపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగాల మేర కోత పడనుందని రెండేళ్ల క్రితమే హండర్స్ ఇండియా సర్వేలో వెల్లడించింది. దానికి అనుగుణంగానే రోజురోజుకూ ఐటి కంపెనీలు సీనియర్లను వదిలించుకుంటున్నాయి. వైస్ ప్రెసిడెంట్ స్థాయి సిబ్బందిని పెద్దఎత్తున గోల్డెన్ హాండ్ షేక్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితులకు కారణాలు అనేకం. టెక్నాలజీలో మార్పులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, వివిధ దేశాల్లో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, స్థానిక అవసరాలు పెరగడం, పెద్దన్నగా భావించే అమెరికాలో పరిస్థితులు, నూతన ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూపోతే చాలా కారణాలున్నాయ. ప్రపంచం డిజిటల్ యుగంవైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకపుడు మనుషులు చేసే పనులను యంత్రాలు చేసేవి, తర్వాతి తరంలో యంత్రాలు చేసే పనులను మనుషులు చేసే రోజులు వచ్చాయి. ఇపుడు మనుషులు చేసే పనులను రోబోలు చేసే రోజులు ఆసన్నమయ్యాయి. వంద మంది మనుషులు నిరంతరం చేసే పనులను రోబోలు ఎలాంటి అలసట లేకుండా అలవోకగా చేసుకుంటూ పోతున్నాయి. తాజాగా అనేక ఐటి కంపెనీలు ఆఫ్‌షోర్‌లో పనిచేస్తున్న సిబ్బందినే గాక, సొంత సిబ్బందిని కూడా తొలగించి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఇన్ఫోసిస్, విప్రోసహా ఇతర ఐటి కంపెనీలు కూడా సిబ్బందిని ఇంటిముఖం పట్టిస్తున్నాయి. చేతికందుతున్న ఆధునిక సాంకేతికత, పెరుగుతున్న ఆటోమేషన్‌తో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా ఇటీవల ఒక నివేదికను విడుదల చేస్తూ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్ర, విప్రో సంస్థల్లో 7.60లక్షల మంది ఉపాధి పొందుతుండగా, కేవలం రెండు నుండి మూడు శాతం వరకూ మాత్రమే ఉద్యోగాలను కోల్పోతారని పేర్కొంది. అంటే 22వేల మంది మాత్రమే ఉద్యోగాలు కోల్పోవచ్చని ఈ నివేదిక చెబుతోంది. ఈ ఏడాది అదనంగా మరో ఏడు వేల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు అని నొమురా అంచనా వేసింది. విప్రోలో పనితీరుబాగా లేదని 600 మందిని తొలగించారు. కాగ్నిజంట్ మొత్తం ఉద్యోగుల్లో 2.3 శాతం మందిని అంటే దాదాపు ఆరువేల మందిని తొలగించింది. మరో ఐటి సంస్థ ఇన్ఫోసిస్ వెయ్యి మంది నుండి రాజీనామా లేఖలను తీసుకుంది. ఐటి కంపెనీల్లో కొత్తగా చేరుతున్న ఉద్యోగులు, నాణ్యతకు తగ్గ పనితీరును కనబరచకపోవడం కూడా వారి తొలగింపునకు కారణమవుతోందని, వస్తున్న అంచనాలకు తగ్గట్టు ఉద్యోగాల కోత ఉండదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెబుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ఇన్ఫోసిస్ వచ్చే ఏడాదిలో 10వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించవచ్చనే ప్రతిపాదనా ఉంది, లక్షల్లో ఉద్యోగాలు కోల్పోతారనే ప్రచారం సరైందేనా కాదా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ అంశంపై కొంత మంత్రి ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.