ఫోకస్

రైతుల సంక్షేమం కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల సంక్షేమం కోసమే రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేశాం. ఏడాదిపాటు దీనిపై కసరత్తు చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆదర్శ రైతు’ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అది అశాస్ర్తియంగా ఏర్పాటు చేశారు. అందుకే వ్యవసాయ రంగంలో శాస్ర్తియ విధానంలో పథకాలు, కార్యక్రమాలు ఉండాలని భావించి రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు అంకురార్పణ చేశాం. ఈ విధానం నాలుగంచెల్లో ఉంటుంది. గ్రామ రైతు సమన్వయ కమిటీలు, మండల రైతు సమన్వయ కమిటీలు, జిల్లా స్థాయి రైతు సమన్వయ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీ ఉంటాయి. రైతులకోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ, కొన్ని లోటుపాట్లున్నాయి. అందుకే రైతులకోసం రైతులే పనిచేసే విధానం తీసుకురావాలని భావించి సమన్వయ సమితిల ఏర్పాటుకు శ్రీకారం దిద్దాం. క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలేమిటో పరిశీలించి ఒక ప్రణాళిక రూపొందిస్తారు. ఒక మండలంలోని గ్రామాలన్నింటికీ కలిపి మండల సమన్వయ సమితి ఏర్పాటవుతుంది. ఆయా మండలాల అవసరాలను సమన్వయం చేసి మండలస్థాయిలో నివేదిక రూపొందిస్తారు. మండల సమితిలను సమన్వయం చేస్తూ జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లాలోని మండలాల పరిస్థితిపై జిల్లా సమితి పరిశీలించి నివేదికలను రూపొందిస్తుంది. చివరకు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటవుతుంది. రాజకీయాలకు అతీతంగా వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. న్యాయపరమైన సమస్యలను అధిగమించి, ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు మేలు చేసేందుకు మా ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేశాం. 36 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయలు ఆదా అయింది. సూక్ష్మసేద్యం ప్రాజెక్టు కింద ఎస్‌సి, ఎస్‌టి రైతులకు నూరుశాతం సబ్సిడీ ఇస్తున్నాం. ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. పాలిహౌజ్‌లు, షెడ్‌నెట్‌లకోసం సబ్సిడీ ఇస్తున్నాం. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యాన, పట్టు, పాడి, కోళ్లు, చేపల పెంపకం తదితర అంశాల్లో భారీ సబ్సిడీలు ఇస్తున్నాం. పంటలకు మంచి ధర లభించేందుకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాదినుండి ఒక్కో రైతులకు ఒక ఎకరానికి నాలుగువేలు పెట్టుబడిగా ఇవ్వాలని నిర్ణయించాం. ఖరీఫ్, రబీపంటలకు ఈ విధానం అమలు చేయడంవల్ల ఒక్కో రైతుకు ఏటా ఒక ఎకరానికి ఎనిమిదివేల రూపాయలు అందించినట్టవుతోంది. ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
-పోచారం శ్రీనివాసరెడ్డి
వ్యవసాయ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం.