ఫోకస్

అసమానతలు తావులేకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం జోన్ల వ్యవస్థపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో నిరుద్యోగ యువతను, ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తోంది. జోన్ల వ్యవస్థ కొనసాగించాల్సిందే. ఎందుకంటే 1975 నుంచి జోన్లు అమలులో ఉన్నాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల యువతకు, నగర ప్రాంతాల యువత నుంచి రక్షణ కలుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో మంచి శిక్షణ పొందిన విద్యావంతుడితో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంత నిరుద్యోగి పోటీపడలేరు. కెసిఆర్ ప్రభుత్వం కొన్ని రోజులు జోన్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటన చేసింది. ఆ తర్వాత దీనిపై కసరత్తు చేసింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా జోన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించింది. ఇప్పుడు తెలంగాణలో రెండు జోన్లున్నాయి. ఏపిలో నాలుగు జోన్లున్నాయి. కొత్తగా ఐదారు జోన్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్యను పెంచేటప్పుడు గ్రామీణ, మారుమూల ప్రాంత విద్యావంతులైన నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మళ్లీ అశాంతి వస్తుంది. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. జోన్ల వ్యవస్థను రద్దు చేస్తామని, రాష్టమ్రంతా ఒకేజోన్ ఉంటే బాగుంటుందని కెసిఆర్ తొలుత ప్రతిపాదించారు. దీనివల్ల ఉద్యోగుల పదోన్నతులకు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించారు. అలాగే వెనకబడిన ప్రాంతాల యువకులు, జిహెచ్‌ఎంసి పరిధిలోని యువకులతో పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల్లో పోటీ పడాల్సి ఉంటుంది. రాష్టమ్రంతా ఒకే జోన్ ఉంటే గ్రామీణప్రాంతంలోని బిసి, గిరిజన, మైనార్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న జోన్లలో అసమానతలు లేకుండా చూడాలి. హేతుబద్ధంగా ఉండాలి. జోన్ల వ్యవస్థలో మార్పులు తేవాలంటే రాష్టప్రతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలి. ఈ ప్రక్రియలో న్యాయపరమైన లోపాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
- కె శివకుమార్
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వైకాపా శాఖ