ఫోకస్

శాస్ర్తియ పద్ధతిలో వ్యవస్థీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోనల్ వ్యవస్థను శాస్ర్తియ పద్ధతిలో పునర్ వ్యవస్థీకరించాలి. కొత్త జిల్లాలకు అనుగుణంగా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే స్థానికత నిర్ధారణ యుద్ధ ప్రాతిపదికన ఖరారు చేయడం వల్ల తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపకరిస్తుంది. స్థానికత అంశాన్ని, జోనల్ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన అధికారులతో ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి అభిప్రాయాలు సేకరించాలి. జోనల్ వ్యవస్థ పునర్ వ్యవస్తీకరించడం ద్వారా తెలంగాణ ఉద్యోగ, నిరుద్యోగ భూమి పుత్రులకు న్యాయం జరిగేలా చూడాలి. జోనల్ వ్యవస్థను నూతన జిల్లాలకు అనుగుణంగా ఉండాలని తమ సంఘం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జోనల్ వ్యవస్థను కొత్త జిల్లాలకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించడం వల్ల ఏ జిల్లాకూ అన్యాయం జరుగదు. జిల్లా, స్టేట్ రెండు క్యాడర్లనే కొనసాగించడంవల్ల కొన్ని వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఉండేది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని జోనల్, మల్టీ జోనల్, డిస్ట్రిక్ట్, స్టేట్ క్యాడర్లను కొనసాగించడం వల్ల ప్రస్తుతం ఈ క్యాడర్లలో కొనసాగుతున్న వారికి ఎలాంటి అన్యాయం జరుగడానికి ఆస్కారం ఉండదు.
- ఎ పద్మాచారి
అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం