ఫోకస్

అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పార్టీ నుంచి ఎన్నికై, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లోకి, అధికారంలోకి వచ్చిన పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం. ఎన్నికల్లో ప్రజలు తమ అసెంబ్లీ, లోక్‌సభకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీని ఎన్నుకుంటారు. వీరు ఐదేళ్ల పాటు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో అదే పార్టీలోనే కొనసాగాలి. ఒకవేళ రాజకీయపరమైన, సిద్ధాంతమైన చికాకులు, అవరోధాలు ఎదురైతే, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. పదవికి కూడా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయాలి. అనంతరం ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల్లో నిలబడి తన సత్తాను నిరూపించుకోవాలి. కాని ఇటీవల కాలంలో ఫిరాయింపుల చట్టంలో లొసుగులను ఆసరాగా చేసుకుని అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని మారుతున్నారు. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష పార్టీలను బలహీనం చేసేందుకు ఎమ్మెల్యేలను తమవైపు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అనేక మంది పార్టీలు మారతున్నారు. పదవికి రాజీనామా చేయకుండా నిర్లజ్జగా అసెంబ్లీకివస్తున్నారు. పార్టీని ఫిరాయించిన వారిపై వేటు వేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినా ఏళ్లతరబడి పెండింగ్‌లో ఈ అంశం ఉంటోంది. పైగా విపక్ష పార్టీలో ఉన్న వారిని అధికార పార్టీలోకి చేర్చుకుని వారికి మంత్రి పదవులు ఇస్తున్నారు. ఈ చర్యల వల్ల ప్రజాస్వామ్యం నిర్వీర్యమవుతుంది. ప్రజల మ్యాండేట్‌ను గాయపరిచినట్లే. ఈ చర్యలు ప్రజాస్వామ్య హక్కులకు గొడ్డలిపెట్టు. కొంత మంది ఈ అంశంపైన కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిధిలో విచారణలో ఉంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ఇప్పుడున్న చట్టంలో మార్పులు తేవాలి. పార్టీ మారితే సభ్యత్వం రద్దవుతుందనే విధంగా చట్టంలో సవరణలు తేవాలి.

- విశే్వశ్వరరెడ్డి
వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్