ఫోకస్

అనవసర కాలయాపన చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్‌లోగానీ, అసెంబ్లీలోగానీ చర్చించాల్సిన అంశాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేవలం కాలయాపనతో సరిపెడుతున్నారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం 300 మంది కోటీశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోయింది. జవహర్ లాల్ నెహ్రు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో సోషలిస్ట్ పార్టీ, కమ్యునిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలకు చెందిన సభ్యులు ఉండేవారు. వీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు, వాటి నేపథ్యం నుంచి వచ్చినవారు కావడంతో పార్లమెంట్‌లో వ్యవసాయం, పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగేవి. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో 1983లో దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమై 1991 నాటికల్లా విశ్వరూపం దాల్చాయి. అప్పటి నుంచి దేశంలో అభివృద్థి నమునాపై అన్ని రాజకీయ పార్టీలకు ఒకేరకమైన అంగీకారం ఏర్పడింది. నరేంద్ర మోదీ అయినా, కెసిఆర్ అయినా, మమత బెనర్జీ అయినా, జయలలిత అయినా అందరికీ అభివృద్ధి నమూనాలపై అంగీకారం ఏర్పడటంతో చట్టసభలలో గ్రామీణ ప్రాంతాలపై కానీ, వ్యవసాయరంగం పైనా కానీ, ఆర్థిక అసమానతలపైనా కానీ అర్థవంతమైన చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఏది అయితే చట్టసభల్లో చర్చించాలో వాటిపై చర్చించకుండా అనవసరమైనా, పనికిరాని అంశాలపైకి దృష్టి మళ్లించి ప్రభుత్వాలు కాలం వెల్లదీస్తూ నెట్టుకొస్తున్నాయి. దీంతో చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు తావులేకుండా పోయింది.
..................................

ఉగ్రవాదానికి అంతమెప్పుడు?

ఫ్రాన్స్ రాజధానీ నగరం పారిస్‌పై దాడితో టర్కీలో జరుగుతున్న జి-20 దేశాల సమావేశం దృష్టి ప్రపంచ ఆర్ధిక పరిస్థితి నుండి ఉగ్రవాదంవైపు మళ్లింది.

ఫ్రాన్స్ రాజధానీ నగరం పారిస్‌పై దాడితో టర్కీలో జరుగుతున్న జి-20 దేశాల సమావేశం దృష్టి ప్రపంచ ఆర్ధిక పరిస్థితి నుండి ఉగ్రవాదంవైపు మళ్లింది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకూ ద్వారాలు తెరచి ఉంచే పారిస్‌లోనే ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమంలో 128 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడి తర్వాత పారిస్‌లో శరణార్థులు, ఇతర జాతుల వారిపై ప్రత్యేక దృష్టి పెరిగిపోయింది. ప్రశాంతంగా ఉన్న దేశంలో జరిగిన ఈ అతిపెద్ద ఘాతుకంతో ఫ్రాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా సంస్థ ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడింది. దీంతో ఫ్రాన్స్ సైనిక దాడులకు దిగింది.
ఉగ్రవాదులు పారిస్‌లో మారణహోమం సృష్టించడాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదాన్ని దునుమాడటంలో కొన్ని దేశాలు అనుసరిస్తున్న వివక్షనూ, విపరీత పోకడలనూ సైతం ఖండించాల్సిందే. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తన, పర భేదం చూపిస్తున్న అమెరికా వంటి అగ్రదేశాల వైఖరి అనేక విమర్శలకు దారితీస్తోంది. గతంలో న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లపై అమెరికా సాగించిన దమనకాండ ఎన్నో విమర్శలకు గురైంది. అలాగే తాలిబన్లకు పాలు పోసిన పెంచిన పాకిస్తాన్ వైఖరిని తెగనాడటంలోనూ అమెరికా ఉదాసీన వైఖరినే కనబరుస్తోంది. ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రానంతవరకూ ఉగ్రవాదులు చెలరేగుతూనే ఉంటారన్నది కఠోరసత్యం. ఐసిస్‌నే కాదు, ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా మట్టుబెట్టాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే సామ్రాజ్యవాదపు వికృత శిశువే ఉగ్రవాదం. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఐసిస్ ఉగ్రవాదం ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యం నుంచే పుట్టింది. లిబియా, సిరియాల్లో అంతర్యుద్ధాల సందర్భంగా మరింత పెరిగి విస్తరిస్తూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి సందర్భంగా ఆల్‌ఖైదా పుట్టుకొచ్చింది.
తీవ్రవాదం, ఉగ్రవాదం, మతవాదం, విచ్ఛిన్నకరవాదం... రూపం ఏదైనా వాటి అంతర్లీన సిద్ధాంతం ఒక్కటే. తమ పంతాన్ని నెగ్గించుకోవడం.. క్రోధాన్ని ప్రదర్శించడం.. విచక్షణ లేకుండా మారణహోమం సృష్టించడం.. ప్రజలను అభద్రతా భావానికి గురి చేయడం. ఇది ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితం కాలేదు. ఒక్కో చోట ఒక్కో పేరుతో హింస కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో అయితే దశాబ్దాల తరబడి తీవ్రవాదం, ఉగ్రవాదం వేళ్లూనుకుపోయాయి. ఉగ్రవాదం అనేది మానసికంగా చూస్తే అదో రుగ్మత, సామాజికంగా చూస్తే అదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే అది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఇటీవల పారిస్‌లో జరిగిన భయంకరమైన ఊచకోత ప్రపంచానికి ఒక హెచ్చరిక.
ఉగ్రవాద కార్యకలాపాలకు భారతదేశమూ మినహాయింపు కాదు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దశాబ్దాల తరబడి మన దేశం బలవుతూనే ఉంది. మరోవైపు మన దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో తీవ్రవాదమూ బలంగా వేళ్లూనుకుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన తీవ్రవాదం ఇప్పుడు చత్తీస్‌గఢ్, జార్ఖండ్ దిశగా మళ్లింది. అయితే ఇటీవల జరిగిన కొన్ని తాజా సంఘటనలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ తీవ్రవాదం నీడలు పరచుకుంటోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఫోకస్ హింసావాదంపైనే...నిపుణులు ఏం అంటున్నారో వారి మాటల్లోనే చూద్దాం..

- ప్రొ. హరగోపాల్ సామాజిక శాస్తవ్రేత్త