ఫోకస్

మంచి నాయకత్వంతోనే పార్టీలకు మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లుగానే రాజకీయ వ్యవస్థ కూడా అంతే మార్పు చెందుతుంది. రాజకీయ నాయకులకు ఏ పార్టీలో ఆదరణ, అవకాశం లభిస్తే ఆటువైపుగా వెళ్లడం సహజం. కానీ పార్టీని నడిపించే సారథిపైనే ప్రధాన భారం ఉంటుంది. నమ్ముకుని ఎన్నుకున్నవాడు తగిన న్యాయం చేస్తాడనే విశ్వాసం ఉన్నప్పుడే ఓటర్లు ఆ పార్టీని ఆదరిస్తారు. నాయకులు పార్టీలు మారినా సదరు నేత వ్యక్తిత్వాన్ని కూడా ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. అధికార పార్టీ ప్రజావిశ్వాసాన్ని కోల్పోతే విపక్షానికి పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. విపక్షంలో ఉండి ప్రజలకోసం పోరాడిన పార్టీకి అధికారం లభించిన దాఖలాలు ఏడు దశాబ్దాల దేశ చరిత్రలో అనేకమార్లు కనిపించాయి. వ్యక్తిపోయినంత మాత్రాన పార్టీలకొచ్చే నష్టం ఏమి ఉండదు.

- చింతా ప్రభాకర్
సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ