ఫోకస్

ఇసి కఠిన చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లే ఫిరాయింపుదారులపై ఎన్నికల సంఘమే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించాలి. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్లు అధికార పార్టీకి చెందినవారై ఉండడం, పార్టీ ఫిరాయించినవారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారై ఉంటుండడంతో వారిపై తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. పదవీకాలం పూర్తయ్యే వరకూ కాలయాపన చేస్తుండడంతో మరికొంతమంది తమ స్వలాభాల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. సంబంధిత ఫిరాయింపుదారులపై ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి. అప్పుడు గాని ఫిరాయింపు ఆలోచన ఉన్నవారికి భయం ఉంటుంది. కేరళలో రెండు ప్రధాన పార్టీల నడుమ సభ్యుల వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ, అక్కడ ఏ పక్షం కూడా ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. ఏపి, తెలంగాణల్లో ఫిరాయింపులు ఎక్కువగా ఉన్నాయి. ఏపిలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, తెలంగాణలో ఒక ఎంపి, మరొక ఎంపి టిడిపి మద్దతు పేరుతో ఫిరాయింపులకు పాల్పడినా వీరిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలే ఎంతో ఔన్నత్యమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రపంచ దేశాల్లో చిన్నచూపు వచ్చేలా చేస్తుంది. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఈ ఫిరాయింపులకు సంబంధించి కఠిన చట్టం రూపొందించాలని వైకాపా తరపున కోరడం జరిగింది. చట్టాల్ని నీరుగారుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అధికారపక్షం అపహాస్యం చేస్తూ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. పార్టీ ఏదైనప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీ ప్రలోభాలకు లొంగి ఫిరాయింపులకు పాల్పడేవారు కూడా ఆలోచించాలి. కఠిన చట్టం రూపొందించడం ద్వారానే రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి పార్టీ ఫిరాయింపులకు ఫుల్‌స్టాప్ పెట్టగలమన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

- మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు ఎంపీ, వైసిపి ఫ్లోర్‌లీడర్