ఫోకస్

ఫిరాయింపులు ప్రోత్సహించకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలు వ్యతిరేకించే పార్టీ ఫిరాయింపులను, మార్పులను ఏ రాజకీయ వ్యవస్థా ప్రోత్సహించ కూడదు. ఎవరు పార్టీ ఫిరాయించినా అంతిమ తీర్పును ప్రజలే నిర్ణయిస్తారు. రాజకీయాల్లో పార్టీ విధానాలకు, ఆశయాలకు, కార్యక్రమాలకు, నాయకత్వ లక్షణాలను ఆధారం చేసుకుని అవకాశాలు వస్తుంటాయి. నాయకులు ఆయా పార్టీ విధానాలు, ఆశయాలకు, కార్యక్రమాలను నాయకత్వ లక్షణాలతో నిర్మాణం చేసుకుంటూ రావాల్సి వుంటుంది. ఈ విధానాలు నాయకులను ఆకర్షిస్తాయి. నాయకులు సంస్థను అభివృద్ధి చేయాల్సి వుంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా నాయకులను అభివృద్ధి చేస్తుంది. ఆయా అభివృద్ధి పార్టీకి ఉపయోగపడాల్సి వుంది. అయితే ప్రస్తుతం ఒక పార్టీనుంచి మరో పార్టీలోకి లాగేసే విధంగా ప్రోత్సహిస్తే ఆయా సంస్థలు బలోపేతం అవుతాయని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటువంటి పరిణామాలకు ప్రజామోదం తక్కువగా వుంటుంది. పార్టీ మార్పులు, ఫిరాయింపులు ప్రోత్సహించడం మంచి వాతావరణం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్య పార్టీలకు ఇది తగదు. ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎపిలో వైసిసి వారిని లాగేస్తుంటే, తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ వారిని లాగేయడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని అనివార్య కారణాలవల్ల గతంలో ఇటువంటి పరిణామాలు జరిగితే, ఒక పార్టీనుంచి మరో పార్టీకి మారితే అటువంటివారికి ఏదో సలహా, పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఇచ్చేవారు. ఇపుడు ఏకంగా పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులే కట్టబెడుతున్నారు. ఇటువంటి పరిణామాలు చర్చకు తావిస్తున్నాయి. అంతిమంగా ప్రజలు వ్యతిరేకించే ఫిరాయింపులను ఏ రాజకీయ వ్యవస్థ ప్రోత్సహించకూడదు.

-సోము వీర్రాజు, ఏపీ ఎమ్మెల్సీ
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు