ఫోకస్

రాజకీయ వలసలు ఆపేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచాక, మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఎన్నికైన పార్టీని వదిలేసి, మరో పార్టీలో చేరే అభ్యర్థులు ఈ చట్టం ద్వారా అనర్హులవుతారు. ఒక పార్టీ పక్షాన ఎన్నికై, మరో పార్టీలో చేరడం అనేది అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఈ తరహా చర్యలను నివారించడానికే ఈ చట్టం చేశారు. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్టు రాజకీయ పార్టీలు సైతం తెలివి మీరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి దొరకకుండా అక్రమ మార్గాలు పాటిస్తున్నాయి. పార్టీ ఫిరాయించినట్టు చెప్పకుండానే అనుబంధ సభ్యులుగా ఉంటున్నారు. లేదా ఆ విషయం కూడా చెప్పకుండానే అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అధికార పార్టీ, విపక్ష పార్టీ రెండూ వారిని తమ సభ్యుడిగానే చూస్తున్నాయి. వారు పార్టీ మారారా? లేదా? అన్నది నిర్ణయించాల్సిన స్పీకర్ ఆ అంశాలను అధ్యయనం చేస్తూనే ఐదేళ్లు గడిపేస్తారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణాధికారాలను ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదు. దీంతో పబ్లిక్‌గా జరుగుతున్న జంపింగ్‌లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా, సాంకేతిక అంశాలతో అవి కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ నుండి నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరగా, ఆంధ్రాలో వైకాపా నుండి టిడిపిలోకి, టిడిపి నుండి వైకాపాలోకి కొంతమంది మారారు. చిన్నాచితకా నాయకులైతే లెక్కే ఉండటం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కండువా కప్పుకుని మరీ పార్టీ మారుతున్నారు. అయినా వారిపై చర్యలకు సాంకేతిక అంశాలు అడ్డొస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి వ్యవహారాలు భారత రాజకీయాల్లో కొత్తేమీ కాదు. గత 50 ఏళ్లుగా పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ మిగిలిన పార్టీలతో మైండ్ గేమ్ ఆడుతూ విపక్ష పార్టీలను బలహీనపరిచి ఎన్నికల క్షేత్రంలో వారికి చిరునామా లేకుండా చేయాలనే ఎత్తుగడ కూడా కొత్తదేమీ కాదు. గెలుపే ప్రధాన అజెండాగా నాయకులు భావించడం కూడా ఈ వలసలకు కారణమవుతోంది. ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే గమ్మత్తుగా పార్టీలు మారుతున్నారు. దీనికి తగ్గట్టే రాజకీయ పార్టీలు సైతం ముందస్తుగానే లీక్‌లు ఇస్తున్నాయి. ప్రసార, సామాజిక మాధ్యమాలు వీటికి విస్తృత ప్రాధాన్యత ఇస్తున్నాయి. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని విపక్షాలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. నైతికత, రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పడేసి రాజకీయాలే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. వలసలు ఎందుకు అని ప్రశ్నిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటూ నేతలు సమాధానాలు చెబుతున్నారు. కిందిస్థాయి నేతలు కూడా అదేబాటలో పయనిస్తూ అభివృద్ధి మంత్రం పఠిస్తున్నారు. ఈ క్రమంలో వలసలపై కొంతమంది రాజకీయ నాయకుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్