ఫోకస్

మనోవిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మస్థైర్యం, మనోవిజ్ఞానంపై ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సరియైన శిక్షణ ఇస్తే భవిషత్తుపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు వత్తిడిని ఏ విధంగా తట్టుకోవాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. కళాశాల స్థాయికి చేరుకునేసరికి చదువు వత్తిడిని నివారిస్తూనే నీతిని బోధించాలి. విద్యార్థుల్లో ఆశావాహన దృక్ఫథాన్ని కల్పిస్తే నిలదొక్కుకుంటారు. వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైన నీతిని బోధించే కథలను, నీతి వ్యాఖ్యాలను ప్రాథమిక స్థాయిలో బోధించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. జీవన మూలాలను తెలియజెప్పే సాంస్కృతిక బోధనకు అవకాశం కల్పించకపోవడమే ఈ దుస్థితికి కారణం. మార్కులు, ర్యాంకుల సాధనే విద్యాభ్యాసం కాదనేది నిత్య సత్యం. విద్యా సంస్థలకు దీటుగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారిపై వత్తిడి తేకుండా ఉండాలి.

- హరినాథ శర్మ. విద్యావేత్త, సిద్దిపేట డిగ్రీ కళాశాల