ఫోకస్

అవగాహన రాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల్లో అవగాహన లేకపోవడంతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యాపరంగా పోటీపడుతున్న కళాశాలలు, విద్యార్థుల అభీష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పోటీ పడి చదివిస్తున్నారే తప్పా.. పిల్లల మానసిక ఒత్తిడి, వారి ఇష్టా, అయిష్టాలు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఫలానా వారి పిల్లలు.. ఫలానా కళాశాలలో చదువుతున్నారు అంటూ పోటీ పడుతున్నారు. కానీ వారి చదువులు ఎలా ఉన్నాయి... ఎలా చదువుతున్నారు... వారిని ఏ గ్రూపులో చదివించాలి... తమ ఆర్థిక పరిస్థితి ఏమిటీ? అన్న ప్రశ్నలు వేసుకోలేకపోతున్నారు. కొన్ని ఆత్మహత్యలు ఫీజుల వేధింపులని, మరికొన్ని ఆత్మహత్యలు కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యమని పత్రికల్లో చదువుతున్నాం. కానీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారిలో అవగాహన పెంపొందించాలని ఆలోచించడం లేదు. విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న తరువాత పైచదులు చదివించడంపై విద్యార్థులు ఏ సబ్జెక్టును ఎంచుకుంటారో వారి ఇష్టానికి వదిలివేయాలి. ప్రస్తుత సమాజంలో వారి ఇష్టా అయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా పోటీపడి కళాశాలల్లో చేర్పిస్తున్నారు. అలా కళాశాలల్లో చేరిన విద్యార్థులు, అక్కడి వాతావరణం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి ఎదురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడున్నారనడంలో సందేహం లేదు. ఎప్పుడైనా విద్యను ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు, విద్యార్థి మెరిట్‌ను బట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. విద్యభ్యాసం వరకు ఉద్యోగం వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఇంకా మంచిదే. కొన్ని దేశాలు ఈ తరహలోనే విద్యార్థులకు మంచి విద్య అందిస్తూ, ఉద్యోగాలు సమకూర్చేవరకు బాధ్యత వహిస్తున్నాయి. అలాంటి దేశాలను ఆదర్శంగా తీసుకుని, విద్య, ఉపాధి వంటి అవకాశాలను ప్రభుత్వమే కల్పించాలి.

-జగన్‌మోహన్ మెట్ల, లోక్‌సత్తా, తెలంగాణ ఉపాధ్యక్షుడు