ఫోకస్

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మస్థైర్యం నింపడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మహత్యా ధోరణిని వారు విడనాడేలా చేయవచ్చు. ఇటు కుటుంబానికి, అటు దేశానికి ప్రయోజకలుగా ఉండాల్సిన ఉండాల్సిన వారు అర్ధంతరంగా జీవితాలను ముగించుకుంటున్నారు. వీటికి గల కారణాలు ఏమో పరిశిలించి, ఆ కారణాలను సరిచేసి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపే మార్గలను అలోచించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ తరం పిల్లలకు కావాల్సిన అంత ఆత్మస్ధైర్యం వారి కుటుంబాల నుండి వారికి అందడం లేదనేది వాస్తవం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో ఆ కుటుంబంలోని సభ్యులు పిల్లలకు ప్రతి పరిస్థితిలో కావాల్సిన సలహాలు, సూచనలు, ఆత్మస్ధైర్యం, ధైర్యం, ప్రోత్సాహాన్నిచ్చేవారు. అందుకు అప్పట్లో ఇలాంటి ఆత్మహత్యాలకు ఏ ఒక్కరు కూడా పాల్పడేవారు కాదు. చిన్నవిషయానికి కుంగిపోవటం, తీవ్రమైన మనోవేదన చెందుతున్న విద్యార్థులను గమనిస్తూ వారికి స్వాంతన, ఆత్మస్థైర్యం అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉంది. విద్యా సంస్థలో చదువుతున్నప్పుడు విద్యార్థుల బాధ్యత సంస్థ యాజమాన్యం తీసుకోవాలి. విద్యార్థులను అవమానించటం, తక్కువగా చూడటం, కించపరటం కాకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉంది. తోటి విద్యార్ధులు స్నేహభవంతో మెలగాలి. అలాకాకుండా విద్యార్థులు ఒక్కరిక్కరు దూషించుకోకుండా, కలిసి మెలిసి ఉండటంతో ఆత్మహత్యలు నివారించవచ్చు. కొన్ని విద్య సంస్థల్లో ర్యాగింగ్ భూతం విద్యార్థులను పీడిస్తుందనే ఉండడం బాధాకరం. ర్యాగింగ్ విషసంస్కృతి కూడా విద్యార్థులను బలి తీసుకుంటోంది. ప్రభుత్వాలు ఎంతో కఠినమైన పద్దతులు పెట్టిన న్యాయస్థానలు వాటిని అమలు చేస్తున్నప్పటికీ ఇటువంటి పరిస్ధితిల్లో కూడా విద్యార్ధులు ఆత్మస్ధైర్యం కోల్పోతుండడం ఆందోళనకరం. సమాజంలో అందరు అభివృద్ధి చెందిన్నప్పుడే దేశం అభివృద్ది చెందుతుంది. 17 నుంచి 23 ఏళ్ల వయస్సు కలిగిన వారిల్లో ఆత్మస్ధైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిపై విద్యా సంస్థలో మానసిక నిపుణులచేత ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీన్ని పై ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అందరు కలిసి పనిచేసిన్నప్పుడే విద్యార్ధుల ఆత్మహత్యలను నివారించగలం.

- వి. వీరయ్య విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి