ఫోకస్

ఇష్టాయిష్టాలు గమనించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల ఇష్టాయిష్టాలను గమనించకుండా, తమకిష్టమైన కోర్సుల్లో బలవంతంగా చేర్పించటమే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం. విద్యార్థుల్లో చదువులపై ఆసక్తిలేక, వినోదాత్మకత పెరుగుతుండగా టివిలు, సినిమాల ప్రభావం తీవ్రంగా పడటం కూడా ఆత్మహత్యలకు మరో కారణంగా చెప్పవచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మానసిక పరిపక్వత పొందిన డిగ్రీ, పిజి విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ కనబరుస్తున్న వారు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల మనోభావాలు, వారి అభిరుచులు గమనించటంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం, నేటి పోటీ ప్రపంచంలో చిరు ప్రాయంలోనే లక్ష్యం నిర్దేశించుకునేలా దిశా,నిర్దేశం చేయటంలో తల్లిదండ్రులు ప్రోత్సహించటం లేదు. ప్రతిభ కనబరిచే విద్యార్థులతో తమ పిల్లలను పోల్చుకుంటూ, అత్యధిక జిపిఏ రావాలంటూ ఒత్తిడి తెస్తున్నారే తప్ప, చిరుప్రాయం నుంచే వారి చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు. కోర్సుల ఎంపికలో విద్యార్థుల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకుని ప్రోత్సహించాల్సిన అవసరముంది. వారి స్థాయిని బట్టే ఒత్తిడి తేవాలి తప్ప పరిమితికి మించి చేస్తే ఫలితం తీరని ఆవేదన మిగుల్చుతుంది. చదువుపై పిల్లలకు శ్రద్ద కలిగేలా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు, పడుతున్న కష్టాల గురించి అవగాహన కల్పిస్తూ ఉండాలి. ఆట, పాటల మాదిరిగానే చదువును కూడా ఎంజాయ్ చేసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తే వారు ఉన్నత శిఖరాలధిరోహించే అవకాశాలు మెండుగా ఉంటాయి.

- వూట్కూరి నరేందర్‌రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్
తెలంగాణ రికగ్నైజ్డ్ జూ. కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు