ఫోకస్

సర్వీసు కమిషన్లను పటిష్ఠం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్లను రెండు ప్రభుత్వాలు పటిష్ఠం చేయాలి. ప్రతి ఏడాది రాష్ట్రంలో వివిధ గ్రూపుల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలను ప్రకటించాలి. వీటికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి. దరఖాస్తుల స్వీకారం, చివరి గడువు, సిలబస్ ఖరారు, ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఫలితాల వెల్లడి తేదీ, ఇంటర్వూ తేదీలను ముందుగా ఖరారు చేయాలి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఏపి, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. ప్రభుత్వం కూడా జవాబుదారీతనంతో వ్యవహరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు ఆర్థిక శాఖ ప్రతి ఏడాది ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి, వాటికి బడ్జెట్‌ను కేటాయించాలి. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇక పబ్లిక్ సర్వీసు కమిషన్లు ప్రతి విషయంలో తప్పులకు పాల్పడుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు విశ్వాసం సడలుతుంది. పారదర్శకత లోపించడం వల్ల అనుమానం పెరుగుతుంది. ఉదాహరణకు గ్రూప్-1 పరీక్షల తుది ఫలితాల ప్రకటనలో చోటు చేసుకున్న అయోమయం వల్ల ర్యాంకులు మారుతున్నాయి. దీనికి బాధ్యులెవరు? విద్యార్థులను గందరగోళంలోకి నెట్టే విధంగా పబ్లిక్ సర్వీసు కమిషన్లు వ్యవహరించరాదు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి నెలల తరబడి కోచింగ్‌లు తీసుకుంటున్న విద్యార్థులకు సకాలంలో ఫలితాలు వెల్లడి కాకపోయినా, ఫలితాలు వెల్లడించి మళ్లీ వెనక్కుతీసుకున్నా, తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. యుపిఎస్‌సి తరహాలో ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకటించాలి. దీనికి ప్రభుత్వ మద్దతు ఉండాలి. పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు స్వయంప్రతిపత్తి సంపూర్ణంగా ఉండాలి. అలాగే కమిషన్ సభ్యులు అప్రమత్తతతో వ్యవహరించి నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఇంటర్వూ ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ సర్వీసు కమిషన్ల విధి విధానాల్లో మార్పులు రావాలి. అనుమానాలకు తావులేకుండా పటిష్టమైన పద్ధతులను కమిషన్లు అమలు చేయాలి

- కె శివకుమార్, ప్రధాన కార్యదర్శి, వైకాపా తెలంగాణ శాఖ