ఫోకస్

ప్రభుత్వ దృక్పథం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దృక్పథం విధానంలో మార్పు వస్తే తప్ప ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే పరిస్థితి కనిపించటం లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఇంతవరకు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై కూడా ప్రభుత్వం ఆలోచించటం లేదు. దీనికితోడు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. అయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుచేస్తూ పర్మినెంట్ చేయవచ్చునని సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ విషయంలో రాజకీయ నిర్ణయమే కీలకమైంది. అయితే ఇన్ని వేల మందిని పర్మినెంట్ చేస్తే ప్రభుత్వంపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతున్నట్లు కన్పిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 27800 కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా వారిలో 16వేల మంది వైద్యఆరోగ్యశాఖ, 8వేల మంది విద్యాశాఖలో కొనసాగుతున్నారు. వీరందరి సర్వీసును రెగ్యులర్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోగలిగినప్పుడే ఈ పరిణామాలు సాధ్యమవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తే కేంద్రం నుంచి అయా పథకాలకు వచ్చే నిధులను మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 95శాతం వరకు ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులుగానే వెళ్లిపోతున్నాయి. ఇక మిగిలిన దానితో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో అర్థమవుతుంది. ప్రభుత్వం దుబారా ఖర్చును మానుకుని అర్ధవంతంగా బడ్జెట్‌ను ఖర్చుచేస్తే తప్ప కొత్త ఉద్యోగావకాశాలు వచ్చే పరిస్థితి చాలా తక్కువనే చెప్పాలి. కేవలం పోలీసు, ఉపాధ్యాయ నియామకాలు తప్ప మిగిలిన విభాగాల్లో రిక్రూట్‌మెంట్ అన్న మాటే విన్పించటం లేదు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఉన్న పోస్టులతో పోలిస్తే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని సరిచూసుకుంటే 48శాతం పోస్టులు అనగా లక్షా 80వేలు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రభుత్వం ముఖ్యోద్దేశ్యంగా కన్పిస్తున్న ఇ-ఆఫీస్ విధానం రిక్రూట్‌మెంట్‌కు పెద్ద అటంకంగా మారిందనే చెప్పాలి. మూడువంతులకుపైగా పని ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నందున ఇక కొత్త పోస్టుల భర్తీ అవసరం ఏమిటన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పిస్తోంది. ఉద్యోగావకాశాలకు ఇ-ఆఫీస్ విధానమే మోకాలడ్డుతున్నట్లు కన్పిస్తుంది. మరోవైపు ఇటు అవకాశాలు పెంచకుండా అటు ఇష్టారాజ్యంగా నిబంధనలను తోసిరాజని మరీ కళాశాలలకు అనుమతులు ఇవ్వటం మరో సమస్యగా మారుతోంది. దీనివల్ల నాణ్యత పూర్తిగా కొరవడటమే కాకుండా భారీసంఖ్యలో ఉద్యోగార్థులు ప్రతియేటా బయటకు వస్తున్నారు. వీరందరికి అవకాశాలు కల్పించాలంటే భారీ ప్రయత్నం జరగాల్సిందే.

- ఆర్‌ఎస్ హరినాథ్ జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు పశ్చిమ గోదావరి, ఏలూరు