ఫోకస్

నియామకాల్లో తాత్సారం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తోంది. నియామకాల్లో జివోల పేరుతో కొంత.. నోటిఫికేషన్‌ల పేరుతో మరికొంత ఆలస్యం జరుగుతోంది. దీంతో నిరుద్యోగ సమస్య పెరగడంతోపాటు నిరుద్యోగులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలన్నా ముందుగా నిరుద్యోగులకు ఆశ పెడతారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేస్తారు. నిరుద్యోగులను కేవలం ఎన్నికల్లో ఓటర్లుగానే వాడుకుంకున్నారు తప్ప వారికి నిజంగా ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. నిరుద్యోగ సమస్యను తీర్చాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉండడం లేదు. నిరుద్యోగుల ఆందోళన, నిరసన, ఉద్యమాలతో ఇటీవల ప్రభుత్వం కొన్ని జివోలు జారీ చేసింది. అయితే ఉద్యోగ నియామకాల్లో న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాలు చోటుచేసుకోవడంతో సదరు జివోలు, నోటిఫికేషన్లు పనికి రాకుండాపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం జివోలు, నోటిఫికేషన్ల జారీకి ముందే గ్రహిస్తే బాగుంటుంది. న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకుని పకడ్బందీగా నోటిఫికేషన్లు, జివోలు జారీచేయాలి. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం జరిగితే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాలి. ప్రకటించిన ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. నేటి తరానికి ఉద్యోగాలు కలిసి వస్తే, వచ్చే తరాలకు ప్రభుత్వాలపై నమ్మకం పెరుగుతుంది. నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఖాళీలు భర్తీచేయాలి. విద్యనందించే విషయంలో చూపే శ్రద్ధ, ఉద్యోగాలు ఇవ్వడంలోనూ చూపాలి. ఇందుకు పాలకులు నూతన సంస్కరణలు చేపడతారా? ఉన్నవాటినే అమలుపరుస్తారా అనేది ముఖ్యం కాదు. నిరుద్యోగులకు ఉపాధి చూపడమే లక్ష్యంగా మారాలి.

-పాండురంగారావు లోక్‌సత్తా పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు