ఫోకస్

వివాదాలను అధిగమిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ నిరుద్యోగ యువతకు కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్షా పనె్నండు వేల ఉద్యోగాల కంటే అధికంగానే భర్తీ చేపట్టే దిశగా ముందుకెళుతోంది. ఉద్యోగ భర్తీలో తలెత్తిన వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించి భర్తీ, పదోన్నతుల ప్రక్రియల్లో వేగం పెంచాం. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగ పంపకాల్లో తలెత్తిన వివాదాలు, కమలనాథన్ కమిటీ చేసిన జాప్యం తెలంగాణలో ఉద్యోగ భర్తీని మూడున్నర ఏళ్లపాటు జాప్యం చేసింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల విభజన, డిఎస్పీ స్థాయి అధికారుల విభజన సైతం నిన్నమొన్నటిదాకా నడిచింది. ఏఆర్ విభాగంలో ఏపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు నేటికి రాష్ట్రానికి రాలేదు. ఏపిఎస్పీలో పనిచేస్తున్నవారు ఇటీవలే తెలంగాణకు వచ్చారు. విద్యుత్ ఉద్యోగుల పంపకాల్లో తలెత్తిన ప్రతిష్టంభన ఏపి వైఖరితో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉద్యోగ సమస్యలపై చాలవరకు స్పష్టత వచ్చినందున ఇప్పటికే 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల విభజన పూర్తయితేనే ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఉద్యోగ ఖాళీలను గుర్తించి మరిన్ని నోటిఫికేషన్లు వేసేందుకు టిఎస్‌పిఎస్‌సి ద్వారా రంగం సిద్ధం చేస్తుంది. వ్యవసాయ శాఖలో ఏఈవోల భర్తీ చేపట్టగా, తాజాగా మరో రెండున్నర వేల ఉద్యోగాల భర్తీకి, డిఎస్సీ ద్వారా తొమ్మిది వేల ఉపాధ్యాయ నియామకాల భర్తీకి చర్యలు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానిస్టేబుల్స్ నియామకాలు నిరాటంకంగా కొనసాగిస్తుంది. టిఎస్‌పిఎస్‌సి చేపట్టిన ఉద్యోగ భర్తీలో అర్హత విషయమై తలెత్తిన న్యాయపర వివాదాలను, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ రెగ్యులైజేషన్‌పై తలెత్తిన న్యాయవివాదాలను ప్రభుత్వం పరిష్కరించుకుని భర్తీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్టప్రతి ఉత్తర్వుల సవరణ కేంద్రం పరిధిలో ఉన్నందున జోనల్ వివాదాలను అధిగమించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్‌ల ద్వారా నూతన జిల్లాలను అనుసరించి ఉద్యోగ భర్తీలో ముందుడుగు వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై మంత్రివర్గ కమిటీలను వేసింది. యువత, నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగానైతే ఉద్యోగాల లబ్ధి చేకూరుతుందని భావించారో అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీపై కెసిఆర్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. దీనిపై ఇప్పటికే తాజాగా అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి తుమ్మల సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. 2019 ఎన్నికల్లోగా లక్షా పనె్నండువేల ఉద్యోగాలను తప్పకుండా ప్రభుత్వం భర్తీ చేస్తుంది.

- గాదరి కిషోర్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, తుంగతుర్తి