ఫోకస్

నిరుద్యోగుల్లో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రధానంగా మూడు అంశాలపై ఏర్పడ్డది. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు.. ఈ అంశాలపైనే కెసిఆర్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఉద్యమం నడిపించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ మూడు అంశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నారు. దాదాపు 1.12 లక్షల పైగా ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా టిఎస్‌పిఎస్‌సి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంది. కొన్ని పర్యాయాలు సాంకేతిక కారణాల వల్ల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి చేయూత ఇచ్చేందుకు వ్యవసాయ అధికారులు (విఓలు), వ్యవసాయ విస్తరణ అధికారుల (విఇఓలు) పోస్టులను భర్తీ చేశారు. విద్య, వైద్యం, రవాణా, పోలీసు తదితర అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫకడ్బందీగా, పారదర్శకంగా భర్తీ ప్రక్రియసాగుతోంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అమెరికాతో పాటు వివిధ దేశాల్లో పర్యటిస్తూ, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయంగా పేరున్న గూగుల్‌తో సహా అనేక కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్ తదితర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నారు. చదువుకున్న యువత వ్యవసాయం చేసేందుకు అనువైన వాతావరణం కల్పించారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని గ్రామీణ ప్రజలకు అందిస్తున్నారు. పాలిహౌజ్‌ల ఏర్పాటు, మైక్రో ఇరిగేషన్ తదితర విషయాల్లో 90 శాతం సబ్సిడీతో పరికరాలను ఇస్తున్నారు. వీటిని గ్రామీణ యువత పూర్తిగా ఉపయోగించుకుని అభివృద్ది చెందాల్సి ఉంది. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయి. కోర్టులకు వెళ్లి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగకుండా కుతంత్రాలు చేస్తున్నాయి. ఈ అంశాలన్నీ తెలంగాణ యువతీ యువకులు గమనిస్తూనే ఉన్నారు. అందుకే నిరుద్యోగ యువత యావత్తూ కెసిఆర్‌కు అండగా నిలుస్తున్నారు. కెసిఆర్ గొప్పనాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. అతని సారధ్యంలో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కలుగుతున్నాయి.

- గువ్వల బాలరాజు, అచ్చంపేట టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే