ఫోకస్

భారీగా నియామకాలకు ఏపీపీఎస్సీ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేసేందుకు ఎపీపీఎస్సీ భారీ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమవుతోంది. డీఎస్సీ భర్తీకి కూడా చర్యలు చేపడుతోంది. కోర్టు కేసుల వల్ల కొన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుకలగడం లేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన స్కిల్ ఈ కార్పొరేషన్ ద్వారా అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన పథకంలో చదువుకున్న, చదువులేని నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. పరిశ్రమల స్థాపన, సేవారంగాల్లో ఉద్యోగాల కల్పన పెరుగుతోంది. వౌలిక సదుపాయలు పెరిగితే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. అందుకే రూ.7 లక్షల కోట్ల నిధులను వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఒక్క రోడ్ల నిర్మాణానికే కేంద్రం ఖర్చు చేస్తోందంటే వౌలిక సదుపాయాలకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్ధమవుతోంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించే లోపు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి వుంది.