ఫోకస్

నిరుద్యోగ సమస్య తీరేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరుద్యోగ సమస్య కొత్తది కాదు, రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్లు, స్ట్ఫా సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, బ్యాంకింగ్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డులు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణీత వ్యవధిలో ఎన్ని రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నా, లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతూనేవుంది. ఒకపుడు ఉన్నత విద్యకు చేరుకున్నవారి సంఖ్య 4 శాతం మాత్రమే, అదీ వృత్తి సాంకేతిక విద్యాకోర్సులు చేసినవారి సంఖ్య ఒక్క శాతం మాత్రమే. నేడు 15 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారందరికీ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వంవల్ల కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి ఉద్యోగుల సంఖ్య 9 లక్షలు. పోలీసులు, టీచర్లు, ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు కలిపి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 4 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల మంది ఉన్నారు. ప్రతి ఏటా రిటైరయ్యే వారి సంఖ్య 50వేలు వరకూ ఉండగా, ఆ మేరకు నియామకాలు మాత్రం జరగడం లేదు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అసాధ్యమని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేకమార్లు స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఏటా సగటున వెయ్యి ఉద్యోగాలకు కూడా రిక్రూట్‌మెంట్ జరగడం లేదు. టీచర్లు, పోలీసుల ఉద్యోగాలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో సగటున లక్ష నియామకాలు జరిగేవి. అవికూడా రాష్ట్ర విభజన తర్వాత అంత పెద్దఎత్తున జరగడం లేదు. ఇరు రాష్ట్రాల్లో పోలీసు నియామకాలు జరిగినా, ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ జరగలేదు. దీంతో చదువుకున్న యువతలో నిరాశ, నిస్పృహ పెరుగుతున్నాయి. తెలంగాణలో లక్షా 12వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల అసెంబ్లీలో మరోమారు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే బదులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి యువత ఎదగాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ సూచిస్తున్నారు. ఆ దిశగా రెండు రాష్ట్రాలూ పనిచేయాలనేది రాష్ట్ర గవర్నర్ అభిలాషగా ఆయన చెబుతున్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ విధించిన నియమ నిబంధనలు చాలావరకూ న్యాయ సమీక్షకు గురయ్యాయి. దాంతో నియామక ప్రక్రియల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏమిటి... నిపుణులు ఏమంటున్నారు... అదే ఈ వారం ఫోకస్.