ఫోకస్

సమగ్ర చట్టం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. దేశంలోనే హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. కాలుష్య నివారణకు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఉన్నప్పటికీ తగిన సిబ్బంది, చట్టాల అమలు లేకపోవడంతో కాలుష్యాన్ని అరికట్టలేకపోతున్నారు. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌కు కాలుష్యం ఒక పెద్దసవాలుగా మారింది. డీజిల్, పెట్రోలు ఇంధనంతో తిరిగే వాహనాలను రద్దు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనలు చట్టలొసుగుల కారణంగా అవి ఆవిరైపోతున్నాయి. దీనికి సమగ్ర చట్టం రావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివాణకు కఠిన చర్యలు చేపట్టాలి. శబ్ద, యంత్రాలు, వాహనాలు, పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కాలుష్య రక్కసిని తరిమివేయాల్సిందే. అనేక రోగాల బారిన పడుతున్న ప్రజలకు కాలుష్యం శాపంలా మారింది. హైదరాబాద్ నగరంలో మూసీ ప్రవాహం, పరిశ్రమల్లోని రసాయనాలు ఒక సమస్యగా మారాయి. కాలం చెల్లిన వాహనాలు, పెట్రోలు, డీజీల్ ఉత్పత్తులు కల్తీ కాకుండా నిఘా వేయాలి. వీటిపై నిరంతర తనిఖీలు కొనసాగించాలి. చట్టల్లోని లొసుగులను తొలగించి కొత్త సవరణలు చేపట్టాలి. కాలుష్య నివారణ ఒక ఉద్యమంగా కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్భారత్ ఉద్యమంలా, కాలుష్య నివారణకు మరో ఉద్యమం రావాలి. ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్య భూతంపై అందరూ దండెత్తాలి. కాలుష్య నివారణకు అందరినీ భాగస్వాములు చేయాలి. అందుకు చట్ట సవరణతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవాలుగా తీసుకోవాలి. కఠిన నిర్ణయాలతోనే కాలుష్య నివారణ సుగమవుతుంది.

-రాజారెడ్డి, లోక్‌సత్తా, జాతీయ ఫైనాన్స్ కమిటీ చైర్మన్