ఫోకస్

ఇంటినుంచే ప్రారంభం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవసరమైన జాగ్రత్త చర్యలను ప్రతి ఒక్కరు తమ ఇంటినుంచే ప్రారంభించాలి. నేడు పట్టణ, నగర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. పారిశ్రామిక, వాహన, వాయు, శబ్ధ కాలుష్యంతో నగర, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనం అల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను సైతం ఇటీవలి కాలంలో కాలుష్యం వణికిస్తోంది. అయితే ముందు మన ఇంటినుండే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ ఆధునిక యుగంలో మనిషికి తన శరీరానే్న శుభ్రం చేసుకునే తీరిక ఉండటం లేదు. ముందు మన ఇంటినుండే పరిశుభ్రతా చర్యలు ప్రారంభం కావాలి. చాలా ఇళ్ళల్లో ఒక్క డ్రాయింగ్ రూంను మినహాయిస్తే వంటిల్లు, బాత్రూమ్‌లే శుభ్రంగా ఉండవు. ఇంట్లోని చెత్తను, వృధా వస్తువులను బహిరంగ ప్రదేశాలలో నిర్లక్ష్యంగా విసిరివేయకుండా జాగ్రత్త వహించాలి. మనం ఎక్కడైనా కొద్దిసేపు నిరీక్షించాల్సివస్తే ఓ క్యారీ బ్యాగ్‌ను సిద్ధంగా ఉంచుకుని పరిసరాల్లో కనిపించే టీకప్పులు, కాఫీ కప్పులు ఇతర రోడ్డుపై కనిపించే వృథా వస్తువులను సేకరించి డస్ట్‌బిన్‌లో వేయడం మన బాధ్యతగా భావించాలి. స్వచ్ఛ్భారత్ అనేది ప్రభుత్వ నినాదానికే పరిమితం కాకుండా అది అందరి బాధ్యతగా గుర్తించాలి. ఏదో సందర్భం వచ్చినపుడు మాత్రమే చీపురు పట్టుకుని రోడ్లు తుడిచినంత మాత్రాన అది స్వచ్ఛ్భారత్ కాదు. పరిసరాల పరిశుభ్రత అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఢిల్లీవంటి మహానగరాల్లోనూ ఈ సమస్య జఠిలమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ నుండి ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేస్తే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించేందుకు మార్గం సుగమం అవుతుంది.

-బాదం మాధవరావు చైర్మన్, అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ