ఫోకస్

నియంత్రణ చర్యలు చేపట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో, దేశంలో మిగతా పట్టణాలు, నగరాల కంటే ముందుగా రాజమహేంద్రవరంలో కాలుష్య నియంత్రణ వివరాల డిజిటల్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆనం కళా కేంద్రంలో కాలుష్య నియంత్రణ వివరాలు ఎప్పటికపుడు తెలియజేస్తూ ఆయా ప్రమాణాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ ఏటా నగరంలో 30 నుంచి 50 వేల మొక్కలను నాటుతున్నాం. కొత్త మాస్టర్ ప్లాన్‌లో గ్రీన్ జోన్‌ను ఏర్పాటు చేశాం. నల్ల చానల్ ద్వారా డ్రెయిన్ల చెత్తా, చెదారం గోదావరి నదిలో కలవకుండా మెస్‌లు ఏర్పాటు చేశాం. నగర కాలుష్యం నుంచి గోదావరి నది కాలుష్యం కాకుండా అవసరమైన ప్రమాణాలను పాటిస్తున్నాం. ప్రత్యేక స్కీనింగ్ చర్యలు నిర్వహిస్తున్నాం. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. భవనాల కూర్చివేత, నిర్మాణ సమయంలో దుమ్ము, ధూళి కణాలు ఎగసిపడకుండా పరదాలు కట్టుకునే విధంగా నియమావళిని అమలు చేస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నాం. ఆటోలను క్రమబద్ధీకరణలో భాగంగా నగరంలో సిటీ బస్సులను ప్రవేశ పెట్టాం. మాస్టర్ ప్లాన్‌ను అనుగుణంగా విలీనమైన గ్రామాలను అనుసంధానం చూసి నగరం నుంచి గ్రామాలకు కూడా సిటీ బస్సులు ఏర్పాటు చేసి ఆటోల కాలుష్యం లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే నగరంలో 10 సిటీ బస్సులు ఏర్పాటు చేశాం, త్వరలో మరిన్ని సిటీ బస్సులను నడపనున్నాం. రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని రిజర్వు ఫారెస్టు వుండటం వల్ల సహజ సిద్ధంగానే కాలుష్య నియంత్రణ జరుగుతోంది, ఇది నగరానికి సహజసిద్ధ గ్రీన్‌బెల్ట్‌గా దోహదపడుతోంది. దీనికితోడు నగరంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ వ్యవస్థాగతంగా నిర్వహిస్తున్నాం.

- వేగేశ్న విజయరామరాజు నగరపాలక సంస్థ కమిషనర్, రాజమహేంద్రవరం