ఫోకస్

ప్రణాళికాబద్ధంగానే నివారణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టణాల్లో పెరుగుతున్న వాయు, జల కాలుష్యాన్ని ప్రణాళిక బద్ధంగా అరికట్టడం సాధ్యపడుతుంది. మున్సిపాలీటీలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది సహకారాన్ని సద్వినియోగ పర్చుకోవడం కూడా ప్రధానమైన అంశం. కాలుష్య నివారణకు నాలుగు పద్ధతులను అనసరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికీ పంపిణీ చేసిన చెత్త బుట్టలను ప్రజలు వినియోగించేలా చూడాలి. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేయించడం, పురపాలక సంఘం రిక్షాలద్వారా డంప్ యార్డులకు తరలించాలి. రోడ్లను శుభ్రపరిచే సిబ్బంది కాగితాలను, పాలిథిన్ కవర్లను ఎక్కడపడితే అక్కడ కుప్పగా పోసి కాల్చి వేయడంవల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అలాకాకుండా డంప్ యార్డుకే తరలించేలా చర్యలు చేపట్టాలి. డంప్ యార్డుల్లో కూడా కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటిస్తే వాయు కాలుష్యాన్ని నిర్మూలించవచ్చు. పట్టణాల్లో కాలుష్యం పెరిగిపోయి రోగాలబారిన పడుతున్న ప్రజలను హరితహారంపై చైతన్యపర్చాలి. ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసి వాటిని పోషించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. పట్టణాల్లో నిర్వహించే హరితహారంలో ప్రధానంగా మహిళలను భాగస్వాములను చేస్తే చక్కటి ఫలితం వస్తుంది. పట్టణ ప్రజల జీవన విధానాలకు దిక్సూచిగా ఉండే చెరువులు, కుంటల్లోని జలాన్ని కాలుష్యం కాకుండా చూడటంలో పురపాలక సంఘం ముఖ్యభూమిక పోషించాలి. పట్టణంలోని వ్యర్థ జలాలను చెరువుల్లోకి తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలి. బహిరంగ మల విసర్జన లేకుండా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మింపజేసుకునేలా జనాన్ని జాగృతం చేయాలి. దీంతో వాయు కాలుష్యం ఏర్పడకుండా చూడవచ్చు. కాలంచెల్లిన వాహనాలు రోడ్డుపై తిరుగకుండా మోటారు వాహనాల చట్టం ద్వారానా, ట్రాఫిక్ నిబంధనల ద్వారానో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలతోనే కాలుష్య సమస్య తలెత్తుతుందనే ఆలోచనను పక్కనపెట్టి ప్రజల జీవన విధానాల ద్వారా కూడా సమస్య జటిలం అవుతోంది. పర్యావరణ పరిరక్షణ అనేది ఎక్కడినుండో కొనుగోలు చేస్తే వచ్చేది కాదు. ప్రజల అలవాట్లలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం అందరిపై ఉంది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగమే చక్కబెడుతుందనే నిర్లక్ష్యం లేకుండా సమన్వయంగా పనిచేసే విధంగా చూస్తే కాలుష్య నివారణ సాధ్యమవుతుంది.

- కెవి.రమణాచారి సిద్దిపేట మున్సిపల్ కమిషనర్, తెలంగాణ