ఫోకస్

ప్రతి ఏడాదీ పొల్యూషన్ సర్ట్ఫికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుష్యం దేశ ప్రజలను వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీనే కాదు దేశంలోని అన్ని పట్టణాలకు, నగరాలకూ కాలుష్యం విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం హరితహారం పేరిట ఆర్భాటం చేస్తున్నది. కోట్లాది మొక్కలు నాటినట్లు ప్రచారం చేసుకుంటున్నది. కానీ అందులో ఎన్ని మొక్కలు బతికాయి, వాటి రక్షణకు ఎన్ని ట్రీ-గార్డులు ఏర్పాటు చేశాం, ఎవరు బాధ్యత తీసుకుంటారన్నది లేనేలేదు. కేవలం ప్రకటనలతో కాలం గడేపిస్తున్నది. మొక్కలు నాటడం టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆరంభం కాలేదు. అనాదిగా అంటే అశోక చక్రవర్తి చెట్లు నాటించినట్లు పుస్తకాల్లో చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడే చెట్లు పెట్టినట్లు, అవి పెద్దగా కాలుష్యాన్ని నియంత్రిస్తున్నట్లు, అంతకుముందు చెట్లే లేవన్నట్లు టిఆర్‌ఎస్ హడావుడి చేస్తోంది. టిఆర్‌ఎస్ ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెడితే, దేశ ప్రజలకు ముఖ్యంగా పట్టణాలు, నగర ప్రజలకు కాలుష్యం ముప్పుపొంచి ఉన్నది. దీనినుంచి ప్రజలను అర్జంటుగా రక్షించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన చర్యలు తీసుకోకతప్పదు. అందులో ముఖ్యంగా ప్రతి ఏడాది వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనం కాలుష్యం వెదజల్లడం లేదన్న సర్ట్ఫికేట్ పొందాలి. మళ్లీ ఇందులో అవినీతి జరగకుండా ప్రభుత్వమే సిసి కెమెరాలతో నిఘా పెట్టాలి. పదేళ్ళు దాటిన వాహనాలను రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. పదేళ్ళు దాటిన వాహనాలకు మళ్లీ ధర వచ్చేలా చూడాలి. లేకపోతే ఎవరూ వాహనాలు విక్రయించరు. ఇప్పటికీ ముప్పయి, నలబై ఏళ్ళ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అవి మామూలుగా తిరగడం లేదు. విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ, జిహెచ్‌ఎంసి వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. డిజీల్ వాహనాల కొనుగోలు పట్ల ప్రజల్లో నిరాసక్తత వచ్చేలా చూడాలి. వాటివల్ల కూడా కాలుష్యం పెరుగుతున్నది. ఇకపోతే కొన్ని పాత వాహనాల యజమానులు పెట్రోలు, కిరోసిన్ కలిపి నడిపస్తున్నందున కాలుష్యం చెప్పలేనంతగా ఉంటున్నది. దీంతో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఇంకా క్యాన్సర్ కూడా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నడుం బిగించాలి. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలి. అన్ని పార్టీలతోనూ చర్చించి వారి సలహాలు, సూచనలూ తీసుకుని ప్రజలను కాలుష్యం భూతం నుంచి కాపాడాలి.

- సునీతా రావు అడ్వకేట్ టి.పిసిసి అధికార ప్రతినిధి