ఫోకస్

నిర్లక్ష్యమే పెద్దలోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఏర్పాటు చేసే పరిశ్రమలవల్ల లాభాలు, నష్టాలు ఏమిటో బేరీజు వేసేందుకు ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. కాలుష్యం వెదజల్లని పరిశ్రమలకే అనుమతులు ఇవ్వాలి. పరిశ్రమల వల్ల ఉపాధి భారీగా లభిస్తుందని పరిశ్రమలు పెట్టేవారు ప్రచారం చేసుకుంటారు. పరిశ్రమల కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన రైతుల భూములను ప్రభుత్వ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుని, తర్వాత వాటిని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది. సదరు పారిశ్రామికవేత్తలు భూములు కోల్పోయిన రైతులకు, ఆయా గ్రామాల్లోని యువతీ యువకులకు ఇచ్చేది చెప్రాసీ, స్వీపర్ తదితర ఉద్యోగాలే. ఉన్నత పదవులన్నీ వేరేవాళ్లకు కట్టబెడతారు. పటన్ చెరు ప్రాంతం చూడండి. నలభై ఏళ్ల క్రితం స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూగర్భ జలాలు, స్వచ్ఛమైన నీటితో కూడిన వాగులు, నదులు, చెరువులు, కుంటలు ఉండేవి. ఫార్మా కంపెనీలతోపాటు పురుగుల మందులు, రసాయనాలను ఉత్పత్తి చేసే కంపెనీలతో పటన్‌చెరు చుట్టుపక్కల నిండిపోయాయి. ఇప్పుడు గాలి, నీరు, భూమి, చెరువులు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. దాదాపు 20 గ్రామాలు, 14 చెరువులు, నక్కవాగు, మంజీరా నది కాలుష్యానికి గురయ్యాయి.
పరిశ్రమలకు అనుమతి ఇచ్చే ముందే ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించాలి. సదరు పరిశ్రమలవల్ల కాలుష్యం జరిగే అవకాశం ఉందా లేదా? ఉంటే ఎలాంటి కాలుష్యం విడుదలవుతుంది? ఈ కాలుష్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ బాధ్యత సదరు పరిశ్రమ యజమానులే తీసుకోవాలా, ప్రభుత్వం తీసుకోవాలా? తదితర అంశాలపై కాలుష్య నియంత్రణ శాఖ పరిశీలించి, మంచిచెడులను ప్రజలకు వెల్లడించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని ప్రజలతో మొదట చర్చించి అనుమతి ఇవ్వడం మంచిది. 1986 నుండి మేము కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో భాగస్వామ్యులైన రఫీ, సత్తిరెడ్డి తదితర రైతులు చనిపోయారు. ప్రొఫెసర్ శివాజీరావు, నేను పోరాటం చేస్తూనే ఉన్నాం. కోర్టులకు వెళ్లి విజయం సాధించాం. కోర్టుల ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంవల్ల గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లాం. గత నెల 24 న చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తూ, పటన్‌చెరు ప్రాంతంలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలున్న 20 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలని, జల, భూ, గాలి కాలుష్యం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ముందుకు వచ్చి తమ హక్కులపై పోరాటం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పారిశ్రామికవేత్తలపట్ల కఠినంగా వ్యవహరించాలి.

- డాక్టర్ ఎ. కిషన్‌రావు పర్యావరణవేత్త, పటాన్‌చెరు