ఫోకస్

కఠిన చట్టాలు అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు ఢిల్లీ, రేపు దేశమంతా కాలుష్య నగరాలుగా తయారయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేయాలి. చట్టాలు కాగితాలకే పరిమితమైతే చేసేదేమీలేదు. 2020 నాటికి స్వీడన్ దేశంలో అన్ని డీజిల్, పెట్రోలు ఇంధనంతో తిరిగే వాహనాలను రద్దు చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో ఈ తరహా విధానం ఇప్పటికిప్పుడు కాకపోయినా, దశలవారీగా ఎంపిక చేసిన నగరాల్లో అమలుచేయాలి. వాహనాల కొనుగోళ్లు, అమ్మకాలపైన మన దేశంలో నియంత్రణ లేదు. దేశంలోని అన్ని నగరాల్లో శబ్ధ, వాతావరణ, జల కాలుష్యం విపరీతంగా పెరిగింది. జల కాలుష్యం వల్ల టైఫాయిడ్, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. వాతావరణ కాలుష్యంవల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ కేన్సర్, వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీనివల్ల ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఎక్కువ సొమ్ము చెల్లించి వైద్యం చేయించుకునే దుస్థితి నెలకొంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల్లో జల కాలుష్యం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం కేంద్రం గంగానది శుద్ధి, ప్రక్షాళన కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టింది. ఈ ప్రక్షాళన కార్యక్రమం చాల సంక్లిష్టమైంది. పరిశ్రమలవల్ల నదుల్లో కాలుష్యం పెరిగింది. నగర శివార్లలో ఒకప్పుడు నెలకొల్పిన పరిశ్రమలు, నగరాల అభివృద్ధివల్ల ఊరి మధ్యలోకి వచ్చేశాయి. వీటిని నగరానికి దూరంగా ఎంపిక చేసిన ప్రదేశానికి తరలించాలి. ఈ విధానం తెలంగాణలో అమలు చేస్తామంటున్నారు. కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఉద్యోగాల కల్పన, ఆదాయ వనరుల పెంపుదలకు పరిశ్రమలు అవసరం. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు కాలుష్యాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమల లైసెన్సులను రద్దు చేయాలి. నగరాల్లో రోడ్లపై కార్లు పెరిగాయి. ఒక్కో కారులో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. దీనివల్ల రోడ్డుపైన స్పేస్ అంతా కార్లతో నిండిపోతోంది. విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతోపాటు అనేక టూ టైర్ సిటీల్లో కాలం చెల్లిన వాహనాలు వేల సంఖ్యలో రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ వాహనాలు వదిలే పొగను పీల్చి అనేకమంది చిన్నారులు, పెద్దలు నయంకాని రోగాల వ్యాధుల బారినపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివారణకు చట్టాలు అమలు చేసేందుకు స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థను ఏర్పాటు చేయాలి. వీటికి చట్టబద్ధమైన అధికారాలివ్వాలి.

- డాక్టర్ జి శివభారత్ రెడ్డి కన్వీనర్, వైకాపా డాక్టర్ల విభాగంముంచుకొస్తున్న కాలుష్యం ముప్పు