ఫోకస్

2026 దాకా ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను దేశ జనాభా 30 కోట్లు ఉన్నప్పుడు సరిహద్దులను ఖరారు చేసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశ జనాభా 120 కోట్లు దాటింది. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో జనాభా 50 లక్షల వరకు ఉంది. దీనివల్ల ఎంపీ అంటే ఎవరు? ఎక్కడ ఉంటారు? అనే విషయం సామాన్యులకు తెలియదు. ఎన్నికలప్పుడు మొక్కుబడిగా ఓట్లు వేయడం తప్ప, ఎంపీలకు, ప్రజలకు సంబంధం లేకుండా పోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడూ ఒకే విధానం నిరంతరంగా కొనసాగదు. కాలానుగుణంగా మారుతుండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దేశంలో నియోజకవర్గాల పుననర్విభజన విధానాన్ని 2026 వరకు స్తంభింపచేశారు. రాజ్యాంగంలోని 82వ అధికరణ ప్రకారం పార్లమెంటు డిలిమిటేషన్ చట్టం చేస్తుంది. ప్రతి జనాభా గణన తర్వాత ఈ పని జరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నాలుగుసార్లు మాత్రమే డిలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేశారు. 1952, 1962, 1972, 2002 సంవత్సరాల్లో మాత్రమే డిలిమిటేషన్ కమిషన్ చట్టాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేంద్రం ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా 2026 వరకు ఆగకుండా పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాలను పెంచాలి. కాని 2026వరకు డిలిమిటేషన్‌ను ఫ్రీజ్ చేశారు. పైగా ఏపీ పునర్విభజన చట్టంలో 82వ అధికరణకు లోబడి అనే పదం చేర్చారు. దీనివల్ల ఏపీ, తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. లేదా నాట్ విత్ స్టాండింగ్ (సంబంధంలేకుండా) అనే పదాన్ని జోడించి కొంత సవరణ చేసి ఏపీ, తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలను పెంచాలి. పార్లమెంటు సాక్షిగా చట్టం చేసినా ఇంతవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఈ విషయంలో అన్యాయం జరుగుతోంది. ఆంధ్రాలో శాసనసభ నియోజకవర్గాలను 225కు, తెలంగాణలో 153కు పెంచాలి. ఇక ఈ విషయంలో ఏమాత్రం తాత్సారం చేయకుండా కేంద్రం రంగంలోకి దిగాలి.
- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ