ఫోకస్

పాలనా సౌలభ్యానికి అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిపాలన సౌలభ్య కోణంలో ఆలోచిస్తే లోక్‌సభ నియోజకవర్గాల విభజన అవసరమే. కొత్త నియోజకవర్గాల వలన ప్రజలకు మేలు చేకూరుతుంది. అయితే నియోజకవర్గాల విభజన రాజకీయ కోణంలో కాకుండా అందరి ఆమోదంతో ప్రక్రియ చేపడితే మంచిది. నియోజకవర్గాల విభజనతో ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందుతుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. అలాగే అనేక నియోజకవర్గాలు వైశాల్యం పరంగా చాలా పెద్దవి. ఓవైపు పెరిగిన జనాభా, మరోవైపు సుదీర్ఘమైన భౌగోళిక విస్తీర్ణం వంటి కారణాలతో ఆయా నియోజకవర్గాలలో అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో వౌలిక సౌకర్యాల కల్పన అనేది కష్టసాధ్యంగానే మారింది. ఈ తరుణంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజనతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని భావించవచ్చు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందరి అభిప్రాయాలను తీసుకున్న పక్షంలో ఏ విధమైన అభిప్రాయ భేదాలకు తావుండదు. ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో జరగాల్సి ఉండడంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారిస్తుంది.

- తోట నరసింహం పార్లమెంట్ సభ్యుడు, కాకినాడ