ఫోకస్

విభజన మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా జనాభా పెరుగుతున్న నేపధ్యంలో లోక్‌సభ నియోజవర్గాల విభజన అవసరం. రాజ్యాంగం ప్రకారం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవాలి. కాని కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. దేశవ్యాప్తంగా ఈ విభజన జరగాల్సి ఉంది. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గానికి 15 లక్షల మంది వరకు ఓటర్లు ఉంటున్నారు. అదే నియోజకవర్గాల విభజన చేస్తే జనాభా సంఖ్య తగ్గి నియోజకవర్గాలు, నాయకులు పెరుగుతారు. ప్రజలకు కూడా మెరుగైన పాలన అందుతుంది. నియోజకవర్గాల విభజనవల్ల యువతరానికి కూడా అవకాశం కలుగుతుంది. అదేవిధంగా జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. మొత్తంమీద లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల విభజన చేస్తే నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటారు.

- వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు