ఫోకస్

ఆర్థికభారం పెరిగినా.. తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు నియోజకవర్గాల పెంపుతో ఆర్థికభారం పెరిగినప్పటికీ ప్రజలతో సాన్నిహిత్యం మరింత బలపడుతుంది. దీనివలన పాలనా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. పాలనా వ్యవస్థకు ప్రజాప్రతినిధులు వారధి లాంటివారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి వివరిస్తారు. ఎక్కువ మంది సభ్యులుంటే ప్రజలకు చేరువ కావడంతోపాటు మారుమూల సమస్యలు కూడా పరిష్కరించే వీలుకలుగుతుంది. అంతేకాదు ప్రజాభీష్టం మేరకు అవసరమైతే చట్టాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా లోక్‌సభ స్థానాలూ పెరగాలి. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు తదితర అంశాలపై ఎక్కువమంది సభ్యులు పార్లమెంటులో చర్చిస్తే సుపరిపాలన సాధ్యపడుతుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు వసతుల కల్పన జరగాలో ప్రభుత్వం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రజా ప్రయోజనాలు నెరవేరతాయి. అయితే మరో పదేళ్ల వరకు పార్లమెంటు నియోజకవర్గాల విభజన జరగదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం శాసనసభ స్థానాల పెంపుదలకే అవకాశం ఉంది కానీ, లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం లేదు.

- రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు