ఫోకస్

ఇక్కడ కాదు.. అక్కడ అడగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యేకాదు దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లనూ పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీని కోరడం శుభపరిణామం. కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన వాణి వినిపిస్తే ఏమి ప్రయోజనం ప్రధానిని స్వయంగా కలిసి అడగాలి. దానికీ మార్గాలున్నాయి, లోక్‌సభ, రాజ్యసభలో ప్రభుత్వాన్ని అడగాలి, వత్తిడి తేవాలి లేదా ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో కోరాలి. లేదంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కలుపుకుని నాయకత్వం వహించి ప్రధాని వద్దకు వెళ్ళి దేశంలోని లోక్‌సభ సీట్లను పునర్ విభజన చేయాలని డిమాండ్ చేయాలి. కేవలం అసెంబ్లీలో మొక్కుబడి ప్రకటన చేసి, ప్రచారం చేసుకుంటే సరిపోదు. దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అనే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుసుకోవాలి. రాష్ట్రాల్లో ఉండే లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడం కుదరదు. ఇక అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను ప్రతి పదేళ్ళకు ఒకసారి పునర్ విభజన చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. జనాభా పెరుగుతుంది కాబట్టి పదేళ్ళకు ఒకసారి నియోజకవర్గాల పునర్ విభజన జరగాలని రాజ్యాంగంలో నిర్ధేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ శ్రద్ధ వహించడం లేదు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కాబట్టి ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో రెండేసి అసెంబ్లీ సెగ్మెంట్లను పెంచాలని (అంటే మొత్తం 9) తాను ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో సీట్ల సంఖ్య వేర్వేరుగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే, బీహార్‌లో లోక్‌సభ సీటు పరిధిలో 6, రాజస్థాన్‌లో 8, తెలుగు రాష్ట్రాల్లో ఏడేసి ఉన్నాయి. సిక్కింలో ఒకే లోక్‌సభ సీటు ఉంటే ఆ సీటు పరిథిలో 32 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని ప్రధాని మోదీపై వత్తిడి తేవాలి. ఇక్కడ మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు

.
- మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టి.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు