ఫోకస్

లోక్‌సభ స్థానాలు పెంచాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీ మేరకు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. పార్లమెంటు ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన 543 సంఖ్య అలాగే కొనసాగిస్తున్నారు. దేశ జనాభా 125కోట్లు దాటిపోయినందున లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రజావసరాల దృష్యా పెంచడం ప్రధాన అవసరం. 2009 నియోజకవర్గాల పునర్విభజన చేసినా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచకపోవడం సహేతుకంగా లేదు. 2026లోనైనా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరముంది. పార్లమెంటు సభ్యుల పరిధి ఎక్కువగా ఉండటంతో ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను పార్లమెంటులో వినిపించడం ఇబ్బందికరంగా ఉంది. పెరిగిన జనాభా, ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచాలి. తన లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 15లక్షల మంది ఓటర్లు, 25లక్షల మేరకు జనాభా ఉంది. మల్కాజిగిరి వంటి లోక్‌సభ స్థానంలో 29లక్షల మేరకు ఓటర్లే ఉన్నారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో పార్లమెంటు సభ్యులకు సమస్యలు ఎదురవుతున్నాయి. సీట్ల పెంపుతో మరింతమంది ప్రజాప్రతినిధులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించి ప్రజల సమస్యల ప్రస్తావన, పరిష్కార చర్యల్లో, నిధుల మంజూరులో అవకాశాలు మెరుగవుతాయి. 2019 ఎన్నికల్లోగా లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచుతారని తాను భావించడం లేదు. తాను లోక్‌సభలో సీట్ల పెంపుకోసం ప్రస్తావించినా ఇప్పట్లో తమకు ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం పరిపాటిగా వస్తోంది. 2026 వరకు రిజర్వేషన్లు మార్చడం, లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచడం ప్రస్తుతానికి చట్టబద్ధంగా కుదరని పనిగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యంగ సవరణ చేసి లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచవచ్చు. అంత పట్టుదల కేంద్ర ప్రభుత్వంలో, పార్టీల్లో కనిపించడం లేదు. తాను మాత్రం లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం హామీ మేరకు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నాను. చిన్న రాష్ట్రాల్లో సుస్థిర ప్రభుత్వాలకోసం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం హామీ మేరకు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో 36 స్థానాలు పెంపుకు కేంద్రం చర్యలు చేపట్టి విభజన చట్టం హామీని పూర్తి చేయాలి.

- గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు