ఫోకస్

సాధికారతకు అర్థం మారుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధికారతకు అర్థం మారుతోం. మహిళలు శ్రమదోపిడీకి గురవుతున్నారు. అసంఘటిత రంగంలో 96 శాతం మహిళలు తక్కువ వేతనాలతో పనిచేయటమే ఇందుకు నిదర్శనం. విద్య, ఉద్యోగాలతోపాటు హక్కుల సాధనకు రాజకీయ రిజర్వేషన్లు సాధించుకుంటేనే సాధికారతకు అర్థం. ప్రస్తుతం వీటిలో ఏ ఒక్కటీ సక్రమంగా లేవు. ఈ కారణంగానే పురుషాధిక్యత పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు అయినా పదిశాతం మహిళలదే స్వయం నిర్ణయాధికారం కాగా మిగిలిన 40 శాతం మంది పురుషులపై ఆధారపడక తప్పటంలేదు. అందువల్లే స్థానిక రిజర్వేషన్లు ప్రకటించారు. అదే చట్టసభల్లో 33.5 శాతం రిజర్వేషన్లకు అన్ని పార్టీలు అడ్డుపడుతున్నాయి. ఎప్పుడో 1996లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ కూడా ఇప్పుడు నోరు మెదపటంలేదు. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అత్యాచారాలు, దళిత మహిళలపై అరాచకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 5, 6, 7 స్థానాల్లో ఉందని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఉపాధిలో మహిళలకు కనీస వేతనాలు అమలు చేయాలి.. ఆస్తిహక్కుతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తేనే సాధికారత సాధ్యపడుతుంది.
- ధూళిపాళ్ల రమాదేవి, ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి