ఫోకస్

మహిళా మంత్రి ఒక్కరూ లేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకుండా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మహిళల సాధికారిత ఎలా సాధిస్తారు? మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు స్థానం ఉండగా, అందులో ఐదుగురు తెలంగాణకు చెందినవారేనన్న విషయాన్ని మరచిపోరాదు. నేను, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, కొండా సురేఖ. కాగా ఆంధ్ర ప్రాంతం నుంచి గల్లా అరుణ ఒక్కరే ఉన్నారు. ఇక మహిళా సాధికారతకోసం, మహిళల అభివృద్ధికోసం అనేక పథకాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదే తప్ప, ఆచరణలో ఏమాత్రం కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ లాంటి ఒకరిద్దరికోసం హైటెక్స్‌లో జిఇ సదస్సు నిర్వహించగానే సరిపోతుందా? అభివృద్ధి జరిగిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను కుటీర పరిశ్రమలవైపు ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడుతూ నలుగురికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో తొలుత పావలా వడ్డీతో రుణాలు కల్పించినా, అనంతరం వడ్డీ లేని రుణాలు ఇప్పించిన ఘనత మాదే. మహిళలకు ‘అభయ హస్తం’, ‘బంగారు తల్లి’ పథకాన్ని మేమే చేపట్టాం. 60 ఏళ్ళ వయస్సు నిండిన వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టాం. 18 ఏళ్ళు నిండిన మహిళ ఒక్క రూపాయి జమ చేస్తే, ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి జమ చేసేలా బంగారు తల్లి పథకాన్ని చేపడితే అటువంటి పథకాలన్నింటినీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత నిర్వీర్యం చేసింది. కొన్నింటికీ మాత్రం పేర్లు మార్చుకుంది. పథకాలన్నీ మావే. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది.
- డాక్టర్ జె. గీతారెడ్డి, ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్‌పర్సన్